AP news: ఆగస్టు 11 వరకు రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ల రద్దు

దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ నిడదవోలు-కడియం మధ్య ఆధునికీకరణ పనుల కారణంగా ఈనెల 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్‌ అధికారి తెలిపారు.

Published : 23 Jun 2024 05:25 IST

విశాఖపట్నం (రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే: దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ నిడదవోలు-కడియం మధ్య ఆధునికీకరణ పనుల కారణంగా ఈనెల 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్‌ అధికారి తెలిపారు. వీటిలో కీలకమైన రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

  • ఈనెల 24 నుంచి ఆగస్టు 10 వరకు రాజమహేంద్రవరం-విశాఖ (07466) ప్యాసింజర్, విశాఖ-రాజమహేంద్రవరం (07467) ప్యాసింజర్, గుంటూరు-విశాఖ (17239) సింహాద్రి, విశాఖ-గుంటూరు (17240) సింహాద్రి, విజయవాడ-విశాఖ (12718) రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్, విశాఖ-విజయవాడ (12717) రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్, గుంటూరు-విశాఖ (22702) ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్, విశాఖ-గుంటూరు (22701) ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్, విశాఖ-తిరుపతి (22707) డబుల్‌డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు.
  • ఈనెల 23 నుంచి ఆగస్టు 10 వరకు మచిలీపట్నం-విశాఖ (17219), విశాఖ-మచిలీపట్నం (17220) ఎక్స్‌ప్రెస్, గుంటూరు-రాయగడ (17243), విశాఖ-లింగంపల్లి (12805) జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రద్దయ్యాయి. ఈనెల 24 నుంచి ఆగస్టు 11 వరకు రాయగడ-గుంటూరు (17244), లింగంపల్లి-విశాఖ (12806) జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు. ఈనెల 24 నుంచి ఆగస్టు 9 వరకు తిరుపతి-విశాఖ (22708) డబుల్‌డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దయింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని