Ramoji Rao: రామోజీరావుకు ప్రముఖుల ఘన నివాళి

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు రామోజీ ఫిల్మ్‌ సిటీలోని ఆయన నివాసంలో బుధవారం పలువురు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు నివాళులు అర్పించారు.

Updated : 20 Jun 2024 06:17 IST

బుధవారం రామోజీ ఫిల్మ్‌ సిటీలో రామోజీరావుకు నివాళులర్పించిన అనంతరం ఆయన సతీమణి రమాదేవిని పరామర్శిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

ఈనాడు, హైదరాబాద్‌: రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు రామోజీ ఫిల్మ్‌ సిటీలోని ఆయన నివాసంలో బుధవారం పలువురు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు నివాళులు అర్పించారు. రామోజీరావు సతీమణి రమాదేవి, ఈనాడు ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్‌ సిటీ ఎండీ విజయేశ్వరి సహా కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామోజీరావు మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావుకు నివాళులు అర్పించినవారిలో మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌.విద్యాసాగర్‌రావు, కాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌ శాఖ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, మాజీ మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, జైభారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు  వి.వి.లక్ష్మీనారాయణ, ఆదిలాబాద్‌ విజయ డెయిరీ ఛైర్మన్‌ లోక భూమారెడ్డి, సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, దర్శకులు శరత్‌ మండవ, గౌతమ్, కళా దర్శకుడు తోట తరణి, నటుడు జెమినీ సురేశ్‌ఉన్నారు.

రామోజీరావుకు నివాళులర్పిస్తున్న మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌.విద్యాసాగర్‌రావు

 

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య

 

, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్‌ విజయ డెయిరీ ఛైర్మన్‌ లోక భూమారెడ్డి

 

కళా దర్శకుడు తోట తరణి

 

మ్యాగజైన్‌ను ఆవిష్కరించిన ఒడిశా మీడియా

పాత్రికేయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన మీడియా మొఘల్‌ రామోజీరావు మరణం తీరని లోటని ఒడిశా మీడియా ప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు. రామోజీరావు మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ భువనేశ్వర్‌లోని జయదేవ్‌ భవన్‌లో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్‌ పాత్రికేయులు.. రామోజీరావు జీవిత విశేషాలు, ఆయనతో పనిచేసిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు. ‘ఈటీవీ ఒడియా’ ప్రేక్షకుల మన్ననలు పొందిందని కార్యక్రమ సమన్వయకర్త, సీనియర్‌ పాత్రికేయులు నీలాంబర్‌ రథ్‌ అన్నారు. ప్రాంతీయ భాషలకు ఆయన ప్రాధాన్యం ఇచ్చారని, ఒడిశాలో మొదటి ప్రైవేటు శాటిలైట్‌ ఛానెల్‌ ‘ఈటీవీ ఒడియా’నే అని తెలిపారు. ఈ సందర్భంగా రామోజీరావు సాధించిన విజయాలు, పాత్రికేయ రంగంలో ఆయన సేవలను వివరిస్తూ ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. అనంతరం ఆయన జీవిత విశేషాలతో మ్యాగజైన్‌ను ఆవిష్కరించారు. ఇద్దరు యువ కళాకారులు లైవ్‌లో రామోజీరావు చిత్రాన్ని గీశారు. కార్యక్రమంలో భువనేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ సులోచన దాస్, భోగ్రాయ్‌ ఎమ్మెల్యే గౌతమ్‌బుద్ధ దాస్, పాత్రికేయులు, ఒడిశా మాజీ సమాచార కమిషనర్‌ దిలీప్‌కుమార్‌ బిసోయ్, ఫుడ్‌ కమిషన్‌ సభ్యుడు దయానిధి, నటుడు కూనా త్రిపాఠి, నటి నీతూ సింగ్, రచయిత అసిత్‌ మొహంతి, సీనియర్‌ పాత్రికేయులు మాయధర్‌ ప్రధాన్, భక్త త్రిపాఠి, సౌమ్య పరిధా, టెలివిజన్, డిజిటల్‌ మాధ్యమాల్లో, వినోద రంగంలో పనిచేసే పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

రామోజీరావుకు నివాళులర్పిస్తున్న  సినీ దర్శకుడు శరత్, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్,
దర్శకుడు గౌతమ్, నటుడు జెమినీ సురేశ్

 

జైభారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు వి.వి.లక్ష్మీనారాయణ

 

రామోజీరావు జీవిత విశేషాలతో కూడిన మ్యాగజైన్‌ను ఆవిష్కరిస్తున్న ఒడిశా పాత్రికేయులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని