Chandra babu: స్వయంగా వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు

తెదేపా కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలు, సామాన్య ప్రజల్ని కలిసేందుకు సమయం కేటాయిస్తానని ఆయన గతంలోనే చెప్పారు.

Updated : 23 Jun 2024 09:20 IST

తెదేపా కేంద్ర కార్యాలయానికి వచ్చిన మహిళ సమస్య తెలుసుకుంటున్న సీఎం చంద్రబాబు

ఈనాడు డిజిటల్, అమరావతి: తెదేపా కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలు, సామాన్య ప్రజల్ని కలిసేందుకు సమయం కేటాయిస్తానని ఆయన గతంలోనే చెప్పారు. అందులో భాగంగా కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి వందల మంది ప్రజలు వారి సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చారు. చంద్రబాబు అక్కడికి రావడానికి ముందే ప్రజలు బారులు తీరారు. దీంతో పార్టీ కార్యాలయ ప్రాంగణమంతా కిక్కిరిసింది. బారులు తీరిన జనం దగ్గరికి చంద్రబాబే స్వయంగా వెళ్లి వినతులు స్వీకరించారు. పింఛన్ల పెంపుపై పలువురు వృద్ధులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. దివ్యాంగులు కొంతమంది తమకు సాయం చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. అందరి సమస్యల్ని శ్రద్ధగా విన్నారు. ‘జై బాబు, సీఎం బాబు’ నినాదాలతో కార్యాలయం హోరెత్తింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని