CM Chandra babu: నేడు అమరావతి నిర్మాణాల సందర్శనకు చంద్రబాబు

రాజధాని అమరావతి ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో పోలవరాన్ని సందర్శించిన ఆయన.. రెండో పర్యటనలో అమరావతిని పరిశీలించనున్నారు.

Updated : 20 Jun 2024 07:12 IST

ప్రజావేదిక నుంచి పర్యటన ప్రారంభం

ఈనాడు డిజిటల్, అమరావతి, కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: రాజధాని అమరావతి ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో పోలవరాన్ని సందర్శించిన ఆయన.. రెండో పర్యటనలో అమరావతిని పరిశీలించనున్నారు. వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని తెలుసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరనున్న చంద్రబాబు.. తొలుత ప్రజావేదిక శిథిలాల్ని పరిశీలిస్తారు. అనంతరం ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి సీడ్‌ యాక్సెస్‌ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీసు అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాల్ని పరిశీలిస్తారు. ఐకానిక్‌ నిర్మాణాల కోసం గత తెదేపా ప్రభుత్వ హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలకు వెళతారు. అనంతరం మీడియాతో మాట్లాడతారు.

25న చంద్రబాబు కుప్పం పర్యటన: ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ నెల 25, 26వ తేదీల్లో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు బుధవారం తెలిపాయి. మొదట 23, 24 తేదీల్లో పర్యటన ఉంటుందని భావించారు. అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో 25వ తేదీన చంద్రబాబు పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు ధ్రువీకరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని