Updated : 06 Apr 2022 05:23 IST

Chandrababu: 10% ప్రజలకిచ్చి 90% దోపిడీ

ఏటా ఒక్కో కుటుంబంపై రూ.లక్షకుపైగా భారం

తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పథకాల పేరుతో 10% ప్రజలకిచ్చి మిగతా 90% సీఎం జగన్‌ దోచుకుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అప్పులు చేస్తూ వాటి కోసం ప్రజల జేబులను ఖాళీగా మారుస్తూ వారి కష్టార్జితాన్ని దండుకుంటున్నారని మండిపడ్డారు. జగన్‌ నిర్వాకంతో ఒక్కో కుటుంబంపై ఏడాదికి లక్షకుపైగా భారం పడుతోందన్నారు. ఈ పాలనపై ప్రజలు పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రభుత్వ పన్నులు బాదుడుపై ప్రతిపక్ష తెదేపా చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఈ మేరకు చంద్రబాబు మంగళవారం ట్వీట్‌ చేశారు. ‘ఒక పేద మధ్య తరగతి కుటుంబం బతకడానికి 2019లో నెలకు రూ.11 వేలు సరిపోయేది. అదే 2020 నాటికి నెలకు రూ.20 వేలకుపైగానే ఖర్చవుతోంది. గతంలో సంతోషంగా, సంక్షేమంగా సాగిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయాణం ఇప్పుడు సంక్షోభం దిశగా పయనిస్తోంది. చెత్త పన్నులు, పెరిగిన విద్యుత్తు ఛార్జీలు, భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలతో ప్రజల జేబులు గుల్లవుతున్నాయి. ఇక ఇసుక, మద్యం వంటి వాటితో జరిగే దోపిడీ సరేసరి. వైకాపా సర్కారు బాదుడే బాదుడు విధానంతో రాష్ట్ర ప్రజలు విలవిల్లాడుతున్నారు...’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ విధానాన్ని ఎండగడుతూ ప్రజలు పోరాటం చేయాలన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని