Ap Intermediate: ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షల షెడ్యూల్‌లో మార్పు

ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షల షెడ్యూల్‌ మారనుంది. ప్రస్తుతం థియరీ పరీక్షలు ముగిశాక ప్రాక్టికల్స్‌ ఉండగా వీటిని ముందుగానే నిర్వహించాలని ఇంటర్మీడియట్‌ విద్యామండలి భావిస్తోంది.

Updated : 07 Jan 2023 06:47 IST

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షల షెడ్యూల్‌ మారనుంది. ప్రస్తుతం థియరీ పరీక్షలు ముగిశాక ప్రాక్టికల్స్‌ ఉండగా వీటిని ముందుగానే నిర్వహించాలని ఇంటర్మీడియట్‌ విద్యామండలి భావిస్తోంది. ప్రాక్టికల్‌ పరీక్షలు ఏప్రిల్‌15 నుంచి మే10 వరకు రెండు విడతలుగా నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేశారు. మే వరకు ప్రాక్టికల్స్‌ ఉండడంతో ఎంసెట్‌లాంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు సమయం సరిపోదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల షెడ్యూల్‌ను మార్చాలని కళాశాలల యాజమాన్యాలు ఇంటర్‌ విద్యామండలికి విన్నపాలనిచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రాక్టికల్స్‌ ఫిబ్రవరిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఇంటర్‌ విద్యామండలి ప్రతిపాదనలు పంపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని