Chandrababu: రాష్ట్రాభివృద్ధికి చేయూతనివ్వండి

దిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.

Updated : 05 Jul 2024 06:27 IST

కేంద్ర మంత్రులకు చంద్రబాబు వినతులు

ఈనాడు, దిల్లీ: దిల్లీ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి చేయూతనివ్వాలంటూ ఆయన చేసిన వినతులివి..

హోం మంత్రి అమిత్‌షాతో

 • ఏపీలో గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు భూసేకరణ ఖర్చు రూ.385 కోట్లు విడుదల చేయాలి. దాని నిర్వహణకు రూ.27.54 కోట్లు ఇవ్వాలి.
 • విభజన చట్టం ప్రకారం ఆస్తులను పంపిణీ చేయాలి. పదో షెడ్యూల్‌లోని రాష్ట్ర స్థాయి సంస్థలను విభజించాలి.
 • ఏపీ జెన్‌కో, తెలంగాణ డిస్కంల మధ్య ఉన్న ఆర్థిక సమస్యలను పరిష్కరించాలి.
 • 2015 నుంచి పెండింగ్‌లో ఉన్న ఏపీ ఐపీఎస్‌ కేడర్‌ను సమీక్షించి, ఐపీఎస్‌ల సంఖ్యను 79 నుంచి 117కి పెంచాలి. 

రహదారి రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీతో..

కేంద్రమంత్రి గడ్కరీతో సమావేశమైన సీఎం చంద్రబాబు. చిత్రంలో కేంద్రమంత్రులు భూపతిరాజు శ్రీనివాసవర్మ,
రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

 • అమరావతి అభివృద్ధికి దోహదం చేసే ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టును వెంటనే మంజూరు చేయాలి.
 • హైదరాబాద్‌- విజయవాడ మధ్య ఉన్న జాతీయ రహదారిని 6/8 వరుసలుగా విస్తరించాలి.
 • హైదరాబాద్‌- అమరావతి మధ్య కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే అభివృద్ధి చేయాలి.
 • విజయవాడలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించే తూర్పు బైపాస్‌ రోడ్డును వెంటనే మంజూరు చేయాలి. ఎన్‌హెచ్‌ఏఐ నేతృత్వంలో తయారవుతున్న డీపీఆర్‌ను వేగంగా పూర్తి చేసి, వెంటనే ఆమోదముద్ర వేయాలి.
 • కుప్పం- హోసూరు- బెంగళూరు మధ్య 4 వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మించాలి.
 • మూలాపేట (భావనపాడు) నుంచి విశాఖపట్నం వరకు 4 వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ కోస్టల్‌ హైవే నిర్మించాలి.

వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌తో..

కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో చంద్రబాబు

 • విశాఖపట్నం- చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో 3, చెన్నై- బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో 1 పారిశ్రామిక నోడ్స్‌లో పరిశ్రమలకు నీరు, విద్యుత్తు, రైల్వే, రోడ్డు సౌకర్యాలు కల్పించేందుకు గ్రాంట్‌ రూపంలో ఆర్థిక సాయం చేయాలి.
 • కేంద్ర ప్రభుత్వ ఉప్పు భూములను వాటి రిజిస్టర్డ్‌ విలువ ప్రకారం రాష్ట్రంలో పోర్టు ఆధారిత అభివృద్ధి కోసం బదిలీ చేయాలి.

వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో..

కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు వినతిపత్రం ఇస్తున్న చంద్రబాబు

 • ఆంధ్రప్రదేశ్‌కు సమీకృత ఆక్వా పార్కు మంజూరు చేయాలి. 
 • ఉద్యాన పంటల రైతులకు సబ్సిడీ పెంచేందుకు కొత్త విధానాన్ని రూపొందించాలి.
 • ఆర్‌కేవీవై పథకం కింద 2023-24లో రాష్ట్రానికి రావాల్సిన రూ.125.52 కోట్లు విడుదల చేయాలి.
 • హార్టీకల్చర్‌ను సమీకృతంగా అభివృద్ధి చేసే పథకం కింద కేంద్ర వాటా రూ.165 కోట్లు, రాష్ట్ర వాటా రూ.110 కోట్లకు ఆమోదముద్ర వేయాలి.
 • నేషనల్‌ ఆయిల్‌ సీడ్‌ మిషన్‌ కింద కేంద్ర ప్రభుత్వ వాటా రూ.111.29 కోట్లు వెంటనే విడుదల చేయాలి.

ఇంధనశాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో..

కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్, చంద్రబాబు కరచాలన

 • కర్నూలు-విశాఖపట్నం మధ్య హైఓల్టేజ్‌ డైరెక్ట్‌ కరెంట్‌ అంతర్రాష్ట్ర విద్యుత్తు సరఫరా లైన్‌కు ఆమోదం తెలపాలి. అదనపు నిబంధనల నుంచి మినహాయింపునివ్వాలి.
 • విశాఖ- కాకినాడను గ్రీన్‌ హైడ్రోజన్‌ తయారీ హబ్‌గా ప్రోత్సహించాలి.

పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురితో..

కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురికి పుష్పగుచ్ఛం అందజేస్తూ..

 • విభజన చట్టంలోని సెక్షన్‌ 93(4) ప్రకారం బీపీసీఎల్‌ రిఫైనరీ ఏర్పాటు చేయాలి.
 • ఈ నెలాఖరులో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రిఫైనరీ ప్రకటిస్తే దేశంలో ముడిచమురు శుద్ధి సామర్థ్యం పెరిగి 2047కల్లా వికసిత భారత్‌గా ఎదగడానికి దోహదం చేస్తుంది.

16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ అరవింద్‌ పనగడియాకు పుష్పగుచ్ఛం ఇస్తున్న సీఎం చంద్రబాబు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు