Polavaram: ముఖ్యమంత్రి రేపు పోలవరం సందర్శన

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు స్థితిగతులను ఆయన పరిశీలిస్తారు.

Updated : 16 Jun 2024 06:10 IST

క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన అధికారులతో కూలంకషంగా సమీక్ష

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు స్థితిగతులను ఆయన పరిశీలిస్తారు. సోమవారం ఉదయం 9.30కి ఆయన పోలవరం చేరుకుంటారు. ప్రాజెక్టు ప్రాంతమంతా తిరిగి ప్రతి నిర్మాణాన్నీ పరిశీలించనున్నారు. వాటి పరిస్థితి గురించి తెలుసుకుంటారు. తర్వాత అక్కడే పోలవరం అధికారులు, జలవనరులశాఖ అధికారులతో సమీక్షిస్తారు. గతంలో ఆయన సీఎంగా ఉన్న హయాంలో ప్రతి సోమవారం పోలవారంగా పిలిచేవారు. వారం రోజుల్లో ప్రాజెక్టులో ఎంత పురోగతి సాధించాలో లక్ష్యం నిర్దేశించేవారు. అమరావతి సచివాలయంలో ఉండి అక్కడి నుంచే పోలవరం ప్రాజెక్టులో ప్రతి విభాగాన్నీ చూసేలా అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు చేసుకున్నారు. అధికారులతో సమీక్షించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించేవారు. ఆ కృషి ఫలితంగానే పోలవరంలో కుడికాలువ పనులు పూర్తయ్యాయి. ప్రధాన డ్యాంలో 65% పనులు పూర్తయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు