Chandrababu: పులివెందులలో జగనన్న మెగా లేఅవుట్‌పై విచారణ

వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందులలోని జగనన్న మెగా లేఅవుట్‌లో అక్రమాలపై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

Updated : 06 Jul 2024 09:37 IST

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

పులివెందుల లేఅవుట్‌లో పునాదులకే పరిమితమైన ఇళ్లు

ఈనాడు, కడప: వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందులలోని జగనన్న మెగా లేఅవుట్‌లో అక్రమాలపై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. గత వైకాపా ప్రభుత్వంలో 8,400 ఇళ్లను మంజూరు చేసి అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినవారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. ఇక్కడ మూడేళ్ల క్రితం స్థలాలు మంజూరుచేయగా, ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా పూర్తికాలేదు. ప్రభుత్వమే ఐచ్ఛికం-3 కింద ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అప్పగించేలా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి పనులు అప్పగించారు. గుత్తేదారు రూ.60 కోట్ల బిల్లులు తీసుకుని పనులు నిలిపేశారు. వివిధ నిర్మాణ సంస్థలు ఏడింటిని ఎంపికచేసి 6,990 ఇళ్ల నిర్మాణాన్ని పులివెందుల నియోజకవర్గంలో అప్పగించగా... మూడేళ్లలో 99 ఇళ్లనే నిర్మించారు. బిల్లులు మాత్రం రూ.84.70 కోట్ల మేర గృహనిర్మాణ సంస్థ చెల్లించింది. ప్రస్తుతం అన్నిచోట్ల ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని