Chandrababu: నేడు చంద్రబాబు పోలవరం సందర్శన

ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి జిల్లా పర్యటన ఇదే. 2014-19 మధ్య సోమవారాన్ని పోలవారంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు.

Updated : 17 Jun 2024 08:21 IST

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి జిల్లా పర్యటన ఇదే. 2014-19 మధ్య సోమవారాన్ని పోలవారంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు. అదే తరహాలో ఇప్పుడూ సోమవారం రోజునే ప్రాజెక్టు సందర్శనను మొదలు పెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి మ.12 గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. 1:30 గంటల వరకు పనులను పరిశీలించి, 3:05 వరకు ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం విలేకర్లతో మాట్లాడతారు. సా.4 గంటలకు పోలవరం నుంచి ఉండవల్లికి తిరుగు పయనమవుతారు. 

ముస్లింలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

స్వార్థం, అసూయ, రాగద్వేషాలను వీడి మానవుల్లో త్యాగనిరతిని వ్యాప్తి చేయడమే బక్రీద్‌ పండుగ ముఖ్య ఉద్దేశమని సీఎం చంద్రబాబు అన్నారు. హజ్రత్‌ ఇబ్రహీం త్యాగనిరతిని స్మరించుకుంటూ బక్రీద్‌ను భక్తి శ్రద్ధలతో జరుపుకొంటున్న ముస్లింలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్‌ను స్ఫూర్తిగా తీసుకుని సమైక్యతను, సమానవత్వాన్ని సాధిద్దామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని