Chandrababu: పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి సహకరించండి

రాష్ట్రంలోని పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి, రివర్‌ బేసిన్‌ ప్రణాళికల అమలు, వరద నిర్వహణ, డ్యాంల భద్రత వంటి పనులకు సహకారం అందించాలని ప్రపంచబ్యాంకు ప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.

Published : 10 Jul 2024 05:05 IST

ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

అమరావతి సచివాలయంలో ప్రపంచబ్యాంకు ప్రతినిధులతో ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడు.. చిత్రంలో మంత్రి నిమ్మల రామానాయుడు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి, రివర్‌ బేసిన్‌ ప్రణాళికల అమలు, వరద నిర్వహణ, డ్యాంల భద్రత వంటి పనులకు సహకారం అందించాలని ప్రపంచబ్యాంకు ప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. దీర్ఘకాలిక నీటి అవసరాలు, గ్రామీణప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి అంశాల్లో ప్రపంచబ్యాంకు తోడ్పాటు అవసరమన్నారు. సచివాలయంలో సోమవారం ప్రపంచబ్యాంకు ప్రతినిధులు సుమీలా గుల్యానీ, జూప్‌ స్టీట్‌జెస్‌డిజ్కీ, రాజగోపాల్‌ సింగ్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ప్రపంచబ్యాంకు బృందం రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించినట్లు సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలో నీటి నిర్వహణ, సామర్థ్యం ప్రపంచబ్యాంకు సహకారంతో మరింత బలోపేతమవుతుందని ఆయన వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని