CM Chandrababu: నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

సీఎం చంద్రబాబు గురువారం ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, విజయనగరం, విశాఖజిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి పయనమవుతారు.

Updated : 11 Jul 2024 04:54 IST

ఈనాడు డిజిటల్, అమరావతి: సీఎం చంద్రబాబు గురువారం ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, విజయనగరం, విశాఖజిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి పయనమవుతారు. దార్లపూడివద్ద పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు. భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించి.. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం సీఐఐ కాన్ఫరెన్స్‌లో వర్చువల్‌గా పాల్గొంటారు. మెడ్‌టెక్‌ జోన్‌ వర్కర్లతో సమావేశమవుతారు. సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో అధికారులతో సమావేశమై... ఐదేళ్లుగా నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్షిస్తారు. రాత్రికి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని