CM Jagan: నా మంత్రివర్గాన్ని మార్చుకుంటున్నా..

‘నా మంత్రివర్గాన్ని మార్చుకుంటున్నా.. ఈ నెల 11న మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణకు అనుమతించండి’ అని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కోరినట్లు తెలిసింది. బుధవారం సీఎం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు.

Updated : 07 Apr 2022 06:26 IST

గవర్నర్‌తో భేటీలో ముఖ్యమంత్రి జగన్‌

ఈనాడు, అమరావతి: ‘నా మంత్రివర్గాన్ని మార్చుకుంటున్నా.. ఈ నెల 11న మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణకు అనుమతించండి’ అని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కోరినట్లు తెలిసింది. బుధవారం సీఎం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. మంత్రిమండలి మార్పులు చేర్పులపై నివేదించారు. ప్రస్తుత మంత్రుల్లో ఎంత మందిని మారుస్తున్నదీ వివరించారు. గురువారం జరిగే మంత్రిమండలి సమావేశం తర్వాత ఆయా మంత్రుల రాజీనామా కోరనున్నట్లు గవర్నర్‌కు సీఎం తెలిపి.. ఆ మేరకు మంత్రుల రాజీనామాలను ఆమోదించాలని కోరినట్లు తెలిసింది. తర్వాత కొత్తగా మంత్రిమండలిలోకి తీసుకుంటున్న వారి జాబితాను సమర్పిస్తామని, వాటిని ఆమోదించి వారితో 11న ప్రమాణ స్వీకారం చేయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత సీఎం గవర్నర్‌ను కలవడం ఇదే తొలిసారి కావడంతో కొత్త జిల్లాల వివరాలనూ సీఎం వివరించినట్లు తెలిసింది. అరగంటకుపైగా సాగిన ఈ భేటీలో ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని