Bus Conductor: మర్యాదకు మన్నన అందుకుంటున్న ఆర్టీసీ కండక్టర్‌.. అభినందించిన మంత్రి రాంప్రసాద్‌

తెనాలి ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పరుచూరి సుధాకరరావు చక్కటి మర్యాదకరమైన ప్రవర్తనతో మన్నన పొందుతున్నారు.

Updated : 11 Jul 2024 07:08 IST

బస్సులో ప్రయాణికులతో కండక్టర్‌ పరుచూరి సుధాకరరావు

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: తెనాలి ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పరుచూరి సుధాకరరావు చక్కటి మర్యాదకరమైన ప్రవర్తనతో మన్నన పొందుతున్నారు. ప్రయాణికులు బస్సు ఎక్కగానే ‘మీరు ఆర్టీసీ బస్సు ఎక్కినందుకు ధన్యవాదాలు’ అంటూ ఆయన మాటలు కలుపుతారు. టికెట్లు ఇస్తున్న క్రమంలో విసుగు లేకుండా నవ్వుతూ తన పని చేసుకుంటారు. మరి కొద్దినిమిషాల్లో ఫలానా స్టాప్‌ వస్తుందని గట్టిగా అందరికీ వినబడేలా చెబుతారు. బస్సు దిగుతున్న వారికి థ్యాంక్స్‌ చెబుతారు. అంతేకాక సామాజిక మాధ్యమాల వేదికగా ఆర్టీసీ బస్సుల రాకపోకల సమాచారాన్ని పంచుకుంటారు. ఈ క్రమంలోనే ఆయన ప్రయాణికుల మన్ననలు అందుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయం తెలుసుకున్న రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి బుధవారం ఆయనకు ఫోన్‌ చేసి ‘మీరు ఆర్టీసీకి చేస్తున్న సేవ చూశాను.. చాలా బాగుంది’ అంటూ అభినందనలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని