
Corona:రాష్ట్రంలో 1,257 కేసులు
101 రోజుల తర్వాత తొలిసారి వెయ్యికిపైగా నమోదు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 101 రోజుల తర్వాత తొలిసారి 24 గంటల వ్యవధిలో వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 1,257 మందికి కొవిడ్ నిర్ధారణైంది. గతేడాది సెప్టెంబరు 30న చివరిసారిగా 1,010 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత వెయ్యికి పైగా కేసులు వెలుగుచూడటం ఇదే మొదటిసారి. 24 గంటల వ్యవధిలో 38,479 నమూనాలను పరీక్షించగా...3.26 శాతం మందికి కరోనా ఉన్నట్లు తేలింది. ఈ నెల ఒకటో తేదీ నాటికి 0.57 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు గత వారం రోజుల వ్యవధిలో రోజు రోజుకూ పెరుగుతోంది. గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కొవిడ్‌తో మరణించారు.
ప్రవాసాంధ్రుల్లో పెరుగుతున్న కేసులు
విదేశాల నుంచి ఏపీకి చేరుకుంటున్న ప్రవాసాంధ్రుల్లోనూ కొవిడ్ విజృంభిస్తోంది. మస్కట్, కువైట్, కౌలాలంపూర్, దుబాయ్ ఇతర గల్ఫ్ దేశాల నుంచి నిత్యం ఒకటి లేదా రెండు సర్వీసుల్లో ప్రవాసాంధ్రులు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు. 72 గంటలకు ముందు వైరస్ నిర్ధారణ పరీక్ష చేయించుకుని నెగెటివ్ వచ్చిన వారిలో విమానం దిగిన తర్వాత పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. తాజాగా శనివారం దుబాయ్ నుంచి చేరిన ప్రవాసాంధ్రుల్లో నలుగురికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం.
* కర్నూలు వైద్య కళాశాలలోని బాలుర వసతి గృహంలో 11 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు ఆదివారం కొవిడ్ బారిన పడ్డారు. రెండు రోజుల క్రితం నలుగురు హౌస్ సర్జన్లకు కొవిడ్ సోకింది.
* తమిళనాడులోని వేలూర్ సీఎంసీలో 200 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకడంతో కొత్తగా వచ్చే రోగులను ఆసుపత్రిలోకి అనుమతించకూడదని జిల్లా కలెక్టరు కుమరవేల్ పాండియన్ ఉత్తర్వులు జారీ చేశారు. వేలూర్ సీఎంసీలో కరోనా బాధితులు చికిత్స పొందుతుండటంతో శనివారం వైద్య సిబ్బంది పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో సుమారు 200 మందికి కరోనా ఉన్నట్లు తేలింది.
తెలంగాణలో 1,673..
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం 1,673 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,165 కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి కోరల్లో చిక్కి మరొకరు మృతి చెందారు.
ఆర్టీసీ బస్సుల్లో మాస్క్ లేకపోతే రూ.50 జరిమానా
ఈనాడు, అమరావతి: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, లేకుంటే రూ.50 చొప్పున జరిమానా విధించాలని ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని బస్సుల్లో టిమ్స్ ద్వారా జారీచేసే టికెట్లపై ఇదే విషయాన్ని ముద్రించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Most Expensive Pillow: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
-
India News
Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
-
Technology News
WhatsApp: మహిళల కోసం వాట్సాప్‌లో కొత్త సదుపాయం
-
Sports News
Pakistan: ఒకరు విజయవంతమైతే.. మా సీనియర్లు తట్టుకోలేరు: పాక్ క్రికెటర్
-
Movies News
Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
-
World News
Ukraine Crisis: జీ-7 సదస్సు వేళ.. కీవ్‌పై విరుచుకుపడిన రష్యా!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Chiranjeevi: నాకూ గోపీచంద్‌కు ఉన్న సంబంధం అదే: చిరంజీవి
- Bypolls: యూపీలో భాజపాకు బిగ్ బూస్ట్.. పంజాబ్‌లో ఆప్‌కు భంగపాటు
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- E Passport: ఈ పాస్‌పోర్ట్‌లు వస్తున్నాయ్.. ఎప్పటి నుంచి జారీ చేస్తారు?ఎలా పనిచేస్తాయి?
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- PCOD: అధిక బరువుకు బై బై చెప్పేద్దామా.. పరిష్కార మార్గాలివిగో..!
- IRE vs IND: ఐర్లాండ్‌పై అలవోకగా..
- Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
- Droupadi Murmu: ఎట్టకేలకు మోక్షం.. ద్రౌపదీ ముర్ము స్వగ్రామానికి కరెంటు..!