Pawan Kalyan: పర్యావరణ హిత ప్రతిమల్ని పూజిద్దాం

వేడుకల్లో పర్యావరణ హితమైన వస్తువుల్ని, ప్రతిమల్ని వాడాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. త్వరలో వినాయక చవితి రానున్న నేపథ్యంలో మట్టి ప్రతిమలను పూజిస్తే పర్యావరణానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

Published : 09 Jul 2024 06:25 IST

వినాయక చవితి నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పిలుపు

ప్రకృతి వ్యవసాయ నిపుణుడు విజయరాంతో కలిసి వినాయకుడి మట్టి ప్రతిమను చూస్తున్న పవన్‌కల్యాణ్‌ 

ఈనాడు డిజిటల్, అమరావతి: వేడుకల్లో పర్యావరణ హితమైన వస్తువుల్ని, ప్రతిమల్ని వాడాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. త్వరలో వినాయక చవితి రానున్న నేపథ్యంలో మట్టి ప్రతిమలను పూజిస్తే పర్యావరణానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. మంగళగిరిలోని ఆయన నివాసంలో పర్యావరణ, అటవీ శాఖపై సోమవారం సమీక్ష నిర్వహించారు. పవన్‌ మాట్లాడుతూ.. ‘మట్టి వినాయక ప్రతిమల్ని పూజించేలా పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాట్లు చేస్తాం. దేవాలయాల్లో ప్రసాదాలకు తాటాకు బుట్టలు, ఆకుల కప్పుల్ని వాడాలి. వీటిని పిఠాపురంలోని ఆలయాల్లో ప్రయోగాత్మకంగా వినియోగించేందుకు కార్యాచరణ రూపొందించబోతున్నాం’ అని తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌ని ప్రకృతి వ్యవసాయ నిపుణుడు విజయరాం కలిశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా తాను పండించిన పలు బియ్యం రకాలను పవన్‌కు చూపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని