Pawan Kalyan: వ్యర్థాల వినియోగంలో శాస్త్రీయ విధానాలు అనుసరించండి

వ్యర్థాల వినియోగంలో శాస్త్రీయ విధానాలను అనుసరిస్తే.. వాటి నుంచి కూడా సరికొత్త సంపద సృష్టించవచ్చని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు.

Published : 07 Jul 2024 05:11 IST

గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణపై కార్యశాల నిర్వహించండి
అధికారులకు ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆదేశం

ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రదర్శనను తిలకిస్తున్న ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, ఉన్నతాధికారులు

ఈనాడు డిజిటల్, అమరావతి: వ్యర్థాల వినియోగంలో శాస్త్రీయ విధానాలను అనుసరిస్తే.. వాటి నుంచి కూడా సరికొత్త సంపద సృష్టించవచ్చని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఘన, ద్రవ వ్యర్థాల విషయంలో సృజనాత్మకంగా ఆలోచించి వాటిని పునర్వినియోగిస్తే పారిశుద్ధ్య సమస్యను అధిగమించొచ్చని చెప్పారు. ‘వ్యర్థాల నిర్వహణకు అనుసరించాల్సిన విధానాలు, వాటి నుంచి సాధించే ఉత్పత్తులు’ అంశాలపై మంగళగిరిలోని ఆయన స్వగృహంలో శనివారం ‘సాలిడ్‌ అండ్‌ లిక్విడ్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ (ఎస్‌ఎల్‌ఆర్‌ఎం) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘గార్బేజ్‌ టు గోల్డ్‌’ పేరుతో నిర్వహించిన ప్రదర్శనను పవన్‌కల్యాణ్‌ ప్రారంభించారు. ‘చెట్ల నుంచి రాలే ఆకులు, కొమ్మలు, పొడిచెత్తను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం జరుగుతుంది. వాటిని కంపోస్టుగా మారిస్తే ఎరువుగా మారుతుంది. ఈ విషయంలో స్థానిక సంస్థలు చర్యలు చేపట్టాలి’ అని పవన్‌కల్యాణ్‌ సూచించారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని జూపూడిలో స్వచ్ఛ కార్పొరేషన్‌ చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలు, మొక్కల పెంపకాన్ని ఆయన వివరించారు. స్థానిక సంస్థలకు పారిశుద్ధ్య నిర్వహణపై నిపుణులతో కార్యశాల నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని