Pawan Kalyan: విజయవాడలో పవన్‌ కల్యాణ్‌ క్యాంపు కార్యాలయం

విజయవాడలో తనకు కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మంగళవారం పరిశీలించారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వచ్చిన ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.

Published : 19 Jun 2024 04:18 IST

పరిశీలించి మార్పులు సూచించిన ఉప ముఖ్యమంత్రి

ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ క్యాంపు కార్యాలయం

ఈనాడు, అమరావతి: విజయవాడలో తనకు కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మంగళవారం పరిశీలించారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వచ్చిన ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. పవన్‌ కల్యాణ్‌కు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌రావు, కమిషనర్‌ కన్నబాబు స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తరువాత ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనందసాయి, ఇతర అధికారులతో కలిసి క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించి కొన్ని మార్పులు సూచించారు. జలవనరులశాఖకు చెందిన ఇరిగేషన్‌ కాంప్లెక్స్‌లోని క్వార్టర్లను ఉప ముఖ్యమంత్రి నివాసం, క్యాంపు కార్యాలయం కోసం కేటాయిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతికశాఖల మంత్రిగా పవన్‌ కల్యాణ్‌ బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని