Diarrhea: కాకినాడ జిల్లా కొమ్మనాపల్లిలో 70 మందికి అతిసారం.. వ్యవసాయ కూలీ మృతి

కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో గురు, శుక్రవారాల్లో అతిసారం ప్రబలి సుమారు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొమ్మనాపల్లిలో ఉంటున్న ఉప్పాడ మండలం రమణక్కపేటకు చెందిన డి.నాగమణి (36) అనే వ్యవసాయ కూలీ శుక్రవారం మృతిచెందారు.

Updated : 15 Jun 2024 06:13 IST

తొండంగి, అన్నవరం న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో గురు, శుక్రవారాల్లో అతిసారం ప్రబలి సుమారు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొమ్మనాపల్లిలో ఉంటున్న ఉప్పాడ మండలం రమణక్కపేటకు చెందిన డి.నాగమణి (36) అనే వ్యవసాయ కూలీ శుక్రవారం మృతిచెందారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కొమ్మనాపల్లిలో ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటుచేశారు. ఇక్కడ 38 మంది చికిత్స పొందుతున్నారు. మిగతావారు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని సమాచారం. వ్యాధి ప్రబలడానికి కారణం కలుషిత తాగునీరా.. మరేదైనా అయి ఉంటుందా అనే విషయాన్ని అధికారులు ఆరా తీస్తున్నారు. ఒకే గ్రామంలో రెండు రక్షిత మంచినీటి ట్యాంకులు ఉండగా, ఒక ట్యాంకు పరిధిలోని వారే ఎక్కువమంది అస్వస్థతకు గురికావడంతో ఆ ట్యాంకు నీటిని ప్రయోగశాల పరీక్షకు పంపారు. గ్రామంలో వైద్య బృందాలు సర్వే చేయించి వైద్యసేవలు అందిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని