AP DGP: డీజీపీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ శంఖబ్రత బాగ్చీ పుష్పగుచ్ఛం అందించి ఆయనకు స్వాగతం పలికారు.

Published : 22 Jun 2024 05:26 IST

దస్త్రంపై సంతకం చేసి బాధ్యతలు స్వీకరిస్తున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ శంఖబ్రత బాగ్చీ పుష్పగుచ్ఛం అందించి ఆయనకు స్వాగతం పలికారు. పోలీసు బలగాలు గౌరవవందనం సమర్పించాయి. బాధ్యతల స్వీకరణ అనంతరం తిరుమలరావు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులతో సమావేశమై దిశా నిర్దేశం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు అతుల్‌సింగ్, రాజీవ్‌కుమార్‌ మీనా, గోపినాథ్‌ జెట్టి, సీహెచ్‌.శ్రీకాంత్, వినీత్‌ బ్రిజ్‌లాల్, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, రాహుల్‌దేవ్‌ శర్మ తదితరులు డీజీపీని కలిసి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం డీజీపీ ద్వారకా తిరుమలరావు... ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. 

ఆర్టీసీ వీసీ, ఎండీగా డీజీపీ ద్వారకా తిరుమలరావు

ప్రజా రవాణాశాఖ కమిషనర్, ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్, ఎండీగా సీహెచ్‌ ద్వారకా తిరుమలరావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయనను ప్రభుత్వం డీజీపీగా నియమించింది. ఆర్టీసీ బాధ్యతలను కూడా మళ్లీ ఆయనకే అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ శుక్రవారం జీవో విడుదల చేశారు. 


ఉపముఖ్యమంత్రిని కలిసిన డీజీపీ

డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను కలిసిన ద్వారకా తిరుమలరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని