సాగర్‌ స్పిల్‌వే మరమ్మతులు 30 శాతమే పూర్తి

రెండు రాష్ట్రాల వరప్రదాయిని అయిన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు స్పిల్‌వే మరమ్మతు పనులు గడువులోపు పూర్తవుతాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పనులు ప్రారంభమై 40 రోజులు దాటినా ఇప్పటివరకు 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

Published : 22 May 2023 07:07 IST

వేగం పుంజుకోకుంటే పూర్తి కావడం కష్టమే!

ఈనాడు, నల్గొండ: రెండు రాష్ట్రాల వరప్రదాయిని అయిన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు స్పిల్‌వే మరమ్మతు పనులు గడువులోపు పూర్తవుతాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పనులు ప్రారంభమై 40 రోజులు దాటినా ఇప్పటివరకు 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. మరో 40 రోజుల్లో (జూన్‌ చివరికి) 70 శాతం పనులు పూర్తిచేయాల్సి ఉండడమే సంశయాలకు కారణమవుతోంది. 2009తో పాటు 2018, 2020 సంవత్సరాల్లో వచ్చిన వరదలకు ప్రాజెక్టు స్పిల్‌వే  దెబ్బతింది. గేట్ల కింద భాగంలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. వీటి వల్ల ప్రాజెక్టుకు ప్రమాదం ఏర్పడవచ్చన్న నిపుణుల హెచ్చరికతో మరమ్మతులకు ప్రభుత్వం గత నెలలో రూ.20 కోట్లు మంజూరు చేసింది. ప్రాజెక్టు ఓ అండ్‌ ఎం (ఆపరేషన్‌, మెయింటెనెన్స్‌)లో భాగంగా ఏప్రిల్‌ రెండో వారంలో పనులు ప్రారంభమయ్యాయి. 22 భారీ గుంతలను గుర్తించిన ఇంజినీరింగ్‌ సిబ్బంది ప్రస్తుతం 11 గుంతలను కాంక్రీట్‌తో పూడ్చే పనులు చేస్తున్నారు. ఇవి పూర్తయ్యాక మిగతావి చేపట్టనున్నారు. మొత్తం పనులు వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు మరో 40 రోజుల గడువు మాత్రమే ఉంది. ఆ తర్వాత వర్షాలు, వరద ప్రవాహాలతో పనులకు ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పనుల్లో వేగం పుంజుకోకుంటే జులై చివరికైనా పనులు పూర్తికావన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎగువ నుంచి వరద మొదలు కాకముందే జూన్‌ నెలాఖరుకు పనులన్నీ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు