AP cabinet: పెద్దాయన ఫరూక్‌.. పిన్న వయస్కుడు శ్రీనివాస్‌

యువ, సీనియర్ల సమ్మిళితంగా రాష్ట్ర మంత్రిమండలి కొలువుదీరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మినహా మిగిలిన 24 మంది మంత్రుల్లో వయసుపరంగా చూస్తే ఎన్‌ఎండీ ఫరూక్‌ (74) అందరికంటే పెద్దవారు కాగా.. గజపతినగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండపల్లి శ్రీనివాస్‌ (40) పిన్న వయస్కుడు.

Updated : 13 Jun 2024 09:55 IST

ఎన్‌ఎండీ ఫరూక్‌, కొండపల్లి శ్రీనివాస్‌

యువ, సీనియర్ల సమ్మిళితంగా రాష్ట్ర మంత్రిమండలి కొలువుదీరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మినహా మిగిలిన 24 మంది మంత్రుల్లో వయసుపరంగా చూస్తే ఎన్‌ఎండీ ఫరూక్‌ (74) అందరికంటే పెద్దవారు కాగా.. గజపతినగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండపల్లి శ్రీనివాస్‌ (40) పిన్న వయస్కుడు. కొలువుదీరిన మంత్రిమండలి సరాసరి వయసు 55 ఏళ్లు. మంత్రివర్గంలో 13 మంది 50 నుంచి 60 ఏళ్ల మధ్యవారే. వీరిలో పవన్‌కల్యాణ్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, గుమ్మిడి సంధ్యారాణి, ఎస్‌.సవిత ఉన్నారు. 50 ఏళ్లలోపు నారా లోకేశ్, వాసంశెట్టి సుభాష్, రాంప్రసాదరెడ్డి, టీజీ భరత్, అనిత, కొండపల్లి శ్రీనివాస్‌.. 60 ఏళ్ల నుంచి 70ఏళ్ల మధ్య వారిలో పి.నారాయణ, బీసీ జనార్దనరెడ్డి, కందుల దుర్గేష్‌ ఉన్నారు. ఆనం రామనారాయణరెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్‌లు ఇద్దరూ 70 ఏళ్లకు పైబడిన సీనియర్‌ నేతలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని