Andhra News: ఇసుక విధానంలో డిజిటల్‌ చెల్లింపులు

రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో..సీనరేజ్, ఇసుక తవ్వకాలు, రవాణా ఖర్చులు వంటి నామమాత్ర రుసుములను డిజిటల్‌ విధానంలో స్వీకరించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Updated : 08 Jul 2024 06:22 IST

గనుల శాఖ వెబ్‌సైట్లో ఇసుక నిల్వల వివరాలు 
నేటి నుంచి 20 జిల్లాల్లో ఉచితంగా ఇసుక 

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో..సీనరేజ్, ఇసుక తవ్వకాలు, రవాణా ఖర్చులు వంటి నామమాత్ర రుసుములను డిజిటల్‌ విధానంలో స్వీకరించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం ఇసుకను విక్రయించి చెల్లింపులను నగదు రూపంలో తీసుకుని పెద్దయెత్తున అక్రమాలకు పాల్పడింది. తాజాగా ఎన్డీయే ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులోనూ ఎలాంటి నగదు లావాదేవీలు లేకుండా డిజిటల్‌ చెల్లింపులు మాత్రమే స్వీకరిస్తూ, పారదర్శక విధానం అమలు చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా పార్వతీపురం మన్యం, కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, అనంతపురం మినహా, మిగతా 20 జిల్లాల్లో ఇసుక డంపులున్న నిల్వ కేంద్రాల వద్ద సోమవారం నుంచి ఈ ఉచిత ఇసుక విధానం తొలుత అమలు కానుంది. డిజిటల్‌ చెల్లింపుల స్వీకరణ కోసం ఇప్పటికే 16 జిల్లాల్లో బ్యాంకు ఖాతాలు తెరవగా, వాటికి సోమవారం ఆయా బ్యాంకులు క్యూఆర్‌ కోడ్‌ ఇవ్వనున్నాయి. 

ఎప్పటికప్పుడు తాజా సమాచారం

రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఇసుక నిల్వ కేంద్రాలున్నాయి.. వాటిలో ఎంతమేర ఇసుక అందుబాటులో ఉంది.. తదితర వివరాలన్నీ ఆదివారం నుంచే గనుల శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అధికారులు అందుబాటులో ఉంచారు. విక్రయాలు మొదలైనప్పటి నుంచి ఏ రోజుకు ఆ రోజు జరిగిన ఇసుక విక్రయాల వివరాలు, మిగిలిన నిల్వల సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్‌ చేయనున్నారు. సోమవారం నుంచి రెండు వారాల పాటు చేతిరాతతో వే బిల్లులు జారీ చేస్తారు. ఆ తర్వాత నుంచి వాటిని కూడా ఆన్‌లైన్‌లోనే జారీ చేసేలా సాఫ్ట్‌వేర్‌ సిద్ధం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు