సోనూసూద్‌ నివాసాలపై ఐటీ దాడులు

కరోనా సమయంలో ఎంతో మందిని ఆదుకొని దేశవ్యాప్తంగా మన్ననలను పొందిన బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ నివాసం, కార్యాలయాల్లో బుధవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పన్ను ఎగవేతకు సంబంధించిన

Updated : 16 Sep 2021 10:29 IST

ముంబయి, లఖ్‌నవూలోని 6 ప్రాంతాల్లో సోదాలు

ముంబయి: కరోనా సమయంలో ఎంతో మందిని ఆదుకొని దేశవ్యాప్తంగా మన్ననలను పొందిన బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ నివాసం, కార్యాలయాల్లో బుధవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పన్ను ఎగవేతకు సంబంధించిన ఓ కేసు దర్యాప్తులో భాగంగా ముంబయి, లఖ్‌నవూ నగరాల్లోని సూద్‌కు చెందిన ఆరు ప్రాంతాల్లో సోదాలు జరిపామని అధికారులు తెలిపారు. ‘‘లఖ్‌నవూలోని ఓ స్థిరాస్తి సంస్థతో సూద్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో పన్ను ఎగవేత అనుమానాలు ఉన్నాయి. అందుకే ఈ సర్వే ఆపరేషన్‌ నిర్వహించాం’’ అని ఓ ఐటీ అధికారి పేర్కొన్నారు. ఇటీవల సోనూసూద్‌.. దిల్లీ ‘ఆప్‌’ ప్రభుత్వం ప్రారంభించిన ఓ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. సీఎం కేజ్రీవాల్‌ను కూడా కలిశారు. ఆ సమయంలో ఆప్‌ పార్టీలో చేరుతారన్న ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐటీ దాడులపై ఆప్‌ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. సోనూసూద్‌కు మద్దతుగా నిలిచింది. కరోనా సమయంలో లక్షలాది కుటుంబాలకు సూద్‌ సాయం చేశారని.. వారంతా ఆయన కోసం ప్రార్థిస్తారని, ఈ కష్టకాలంలో మద్దతుగా నిలుస్తారని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. కేజ్రీవాల్‌తో సమావేశమైనందుకే ఈ దాడులు జరుగుతున్నాయంటూ వస్తున్న ఊహాగానాలను భాజపా ఖండించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని