Updated : 12 Jan 2022 08:26 IST

Curfew: 18 నుంచి 31 వరకు కర్ఫ్యూ

పండగ తర్వాత అమలుకు నిర్ణయం

నిత్యం రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు!

వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ నుంచి కర్ఫ్యూ అమల్లోకి రాబోతుంది. ఆరోజు నుంచి నిత్యం రాత్రి 11 నుంచి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూ విధించనున్నారు. ఇతరత్రా ఆంక్షలు కూడా జనవరి 31 వరకు వర్తిస్తాయని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మంగళవారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంక్రాంతి దృష్ట్యా స్వస్థలాలకు వచ్చి, వెళ్లే వారి సౌకర్యార్థం పండుగ తర్వాత నుంచి కర్ఫ్యూ అమలు చేయబోతున్నామని వెల్లడించారు. అప్పటిదాకా డిసెంబర్‌లో జారీచేసిన జీవో 751లో పేర్కొన్న నిబంధనలు అమలవుతాయని పేర్కొన్నారు.

నిబంధనలు.. మినహాయింపులు!
* అంతర్‌రాష్ట్ర, రాష్ట్ర సరకు రవాణా వాహనాలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు.

* వివాహాలు, మతపరమైన, సామాజిక కార్యక్రమాలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహిస్తే గరిష్ఠంగా 200 మంది, ఇండోర్‌లో 100 మందికి మాత్రమే అనుమతి.

* ప్రజారవాణా వ్యవస్థల వాహనాల్లో సిబ్బందితోపాటు ప్రయాణికులు మాస్కులు ధరించాలి.

* సినిమా థియేటర్లలో ఒక సీటు వదిలి మరో సీటులో కూర్చోవాలి (50% సీట్లకు అనుమతి).

* కర్ఫ్యూ సమయంలో విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల నుంచి వచ్చిపోయే వారు సంబంధిత టిక్కెట్లు చూపించాలి. వీరి కోసం ఆయా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లుచేయాలి.

* గర్భిణులు, రోగులు, ఆస్పత్రులకు వెళ్లేందుకు వెసులుబాటు.

* ఆస్పత్రులు, వైద్య పరీక్షలు, ఫార్మసీ, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, టెలీ కమ్యూనికేషన్లు, ఇంటర్నెట్‌, ప్రసార సేవలు, ఐటీ, ఐటీ సంబంధిత సేవలు, పెట్రోల్‌ బంకులు, విద్యుత్తు ఉత్పత్తి, పంపిణీ సంస్థలు, నీటి సరఫరా, పారిశుద్ధ్య రంగాల్లోని ఉద్యోగులకు మినహాయింపు

* అత్యవసర విధుల్లో ఉండే న్యాయాధికారులు, కోర్టుల సిబ్బంది, స్థానిక, పురపాలక, పంచాయతీరాజ్‌ సంస్థల సిబ్బందికి మినహాయింపు.

* వ్యాపార, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు తమ ఆవరణలో ఉన్న వారంతా తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలి. లేకుంటే రూ.10వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధిస్తారు.

* కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన షాపింగ్‌ మాల్స్‌, మార్కెట్లను పరిస్థితి తీవ్రతను బట్టి ఒకటి లేదా రెండు రోజుల పాటు మూసివేస్తారు.

 

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని