IVF: ఐవీఎఫ్‌ పద్ధతిలో పుంగనూరు లేగదూడ జననం

ప్రపంచవ్యాప్తంగా పొట్టిగా ఉండే పశువుల జాతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పుంగనూరు జాతి ఒకటి. ఇవి నానాటికీ అంతరించిపోతున్నాయి. దేశం మొత్తం మీద సుమారు 500 కంటే తక్కువే ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి.

Updated : 12 Jan 2022 17:12 IST

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో..
దేశంలోనే తొలిసారన్న ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ

ప్రపంచవ్యాప్తంగా పొట్టిగా ఉండే పశువుల జాతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పుంగనూరు జాతి ఒకటి. ఇవి నానాటికీ అంతరించిపోతున్నాయి. దేశం మొత్తం మీద సుమారు 500 కంటే తక్కువే ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే.. పుంగనూరు జాతికి చెందిన ఓ లేగ దూడ కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్‌) పద్ధతి ద్వారా మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో జన్మించింది. దేశంలో ఈ సాంకేతికతను ఉపయోగించి పురుడు పోసుకున్న తొలి పుంగనూరు ఆవు దూడ ఇదేనని మహారాష్ట్ర పశుసంవర్ధక శాఖ తెలిపింది. దేశీయంగా అంతరించిపోతున్న పశువులను సంరక్షించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను కేంద్ర పాడిపరిశ్రమల శాఖ, రాష్ట్ర పశుసంవర్ధక శాఖలు ఉమ్మడిగా చేపట్టాయి. దేశీయ జాతుల ఆవు పాలల్లో పోషక పదార్థాలు ఉంటాయని అధికారులు తెలిపారు. వేర్వేరు కారణాల రీత్యా కొన్ని దశాబ్దాలుగా దేశీయ పశుసంపద తగ్గుముఖం పడుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో అరుదైన గోవులను రక్షించేందుకు పశుసంవర్ధక శాఖ ఐవీఎఫ్‌ పద్ధతిని ప్రోత్సహిస్తోందని చెప్పారు. పుంగనూరు జాతి ఆవులనే గాక.. బన్ని, తార్పాకర్‌, ఒంగోలు లాంటి మేలిమి జాతుల ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని