
AP News: ఒకే కుటుంబీకుల ఓట్లన్నీ ఒకే పోలింగ్ కేంద్రంలో..
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ ఆదేశం
ఈనాడు, అమరావతి: పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, కొత్త కేంద్రాల ఏర్పాటు వంటి ప్రక్రియలు చేపట్టినప్పుడు... ఒక కుటుంబంలోని సభ్యుల ఓట్లన్నీ కచ్చితంగా ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్లు/జిల్లా ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ‘ఒకే భవనంలో నివసిస్తున్న వారి ఓట్లన్నీ ఒకే ప్రాంతంలోని కేంద్రం పరిధిలో ఉండాలి. ఇప్పటికే ఏమైనా లోపాలుంటే వాటిని వెంటనే సరిదిద్దాలి...’ అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితాల రూపకల్పన ప్రక్రియలో పలు లోపాలున్నాయని, అవకతవకలు జరుగుతున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. కొన్ని చోట్ల ఒకే కుటుంబంలోని సభ్యుల ఓట్లను మూడు నాలుగు పోలింగ్ కేంద్రాల పరిధిలో చేర్చడం వల్ల వారు చాలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ పై మేరకు స్పందించారు. ఆయన కార్యాలయం నుంచి ఈ నెల 11న వర్లకు ప్రత్యుత్తరం వచ్చింది. వర్ల తన లేఖలో ప్రస్తావించిన అంశాలపై ఇచ్చిన ఆదేశాల ప్రతిని కూడా జత చేశారు.
చనిపోయిన వ్యక్తుల పేర్లు తొలగించండి
చనిపోయిన వ్యక్తులు, వలస వెళ్లిన వారి పేర్లు ఓటర్ల జాబితాల నుంచి తొలగించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులను విజయానంద్ ఆదేశించారు. ఒక నిర్దిష్ట సంవత్సరానికి సంబంధించి ఓటర్ల జాబితాల సవరణ నిమిత్తం రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్ల(బీఎల్ఏ)ను నియమించాక, ఆ తర్వాత సంవత్సరాల్లో కూడా వారే కొనసాగుతారని స్పష్టం చేశారు. వారిని బీఎల్ఏలుగా తొలగించాలని సంబంధిత రాజకీయపార్టీ కోరేంత వరకు వారే ఉంటారన్నారు. కొన్ని చోట్ల వీఆర్ఏలు వైకాపా మద్దతుదారుల ఓట్లు మాత్రమే ఉంచి, వైకాపాయేతర పార్టీలకు చెందిన వారి ఓట్లు తొలగిస్తున్నారని, తటస్థ, వైకాపాయేతర పార్టీల ఓటర్లను వాలంటీర్లు బెదిరిస్తున్నారని చేసిన ఫిర్యాదుపై స్పందిస్తూ... అలాంటివి ఎక్కడైనా జరిగితే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (06-07-2022)
-
India News
IAF: యుద్ధ విమానాన్ని కలిసి నడిపిన తండ్రీకూతుళ్లు.. దేశంలోనే తొలిసారి!
-
Sports News
IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
-
Crime News
Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
-
Movies News
RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
- Regina Cassandra: ఆ విషయంలో చిరంజీవిని మెచ్చుకోవాల్సిందే: రెజీనా
- బడి మాయమైంది!
- రూ.19 వేల కోట్ల కోత
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- Jharkhand: బీటెక్ విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. IAS అధికారి అరెస్టు