
Union Budget 2022: విభజన చట్టంలో హామీల ప్రస్తావన లేకపోవడం బాధాకరం
కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన
ఈనాడు-అమరావతి: కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ పలు అంశాల్లో ప్రోత్సాహకరంగా ఉందని పేర్కొంటూనే...రాష్ట్ర విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీల ప్రస్తావన లేకపోవడం నిరాశ కలిగించిందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టు, మౌలిక వసతులు, పరిశ్రమలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు తదితరాలను ప్రస్తావించకపోవడం రాష్ట్రానికి నిరాశ కలిగించిందని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘మౌలిక వసతుల అభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర చాలా కీలకం. వనరుల లభ్యత తక్కువగా ఉండటం, రుణాలు తీసుకోవడంపై ఉండే పరిమితుల వల్ల రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి. కేటాయింపులు పెంచడం, రుణ పరిమితి పెంచేందుకు చర్యలు చేపట్టి ఉంటే రాష్ట్రాలకు మరింత ప్రోత్సాహకరంగా ఉండేది. నరేగా, ఎరువులు, ఆహార రాయితీలు బాగా తగ్గాయి. జల జీవన్ మిషన్, జాతీయ విద్య మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్‌కు కేటాయింపులు పెంచారు. ప్రస్తుత కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జాతీయ ఆరోగ్య మిషన్‌కు కేటాయింపులు మరింత పెంచి ఉంటే బాగుండేది. జాతీయ రహదారులకు కేటాయింపులు రెట్టింపు చేయడం ముదావహం. రాష్ట్రాల్లో మూల ధన వ్యయంగా వెచ్చించేందుకు రాష్ట్రాలకు కేంద్ర సాయంగా ఇచ్చే కేటాయింపులను రూ.లక్ష కోట్లకు పెంచడం ఆనందదాయకం...’ అని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. ‘జీడీపీ పెరగడం మంచి పరిణామం. ద్రవ్యలోటు, రెవెన్యూలోటు తగ్గడం సంతోషదాయకం. కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను రాబడికి జీఎస్టీ బాగా తోడ్పడింది. రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, జలమార్గాలు, సరకు రవాణా, మౌలిక సదుపాయాల రంగాలు ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందేలా జాతీయ మాస్టర్ ప్లాన్ రూపొందించారు...’ అని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Happy Birthday: అతిథిగా టామ్ క్రూజ్.. సరదాగా ‘హ్యాపీ బర్త్‌డే’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
General News
Cancer treatment: క్యాన్సర్ చికిత్స తర్వాత ఏం చేయాలి..?
-
India News
Rahul Gandhi: భాజపా ముఖ్య సమస్యల్ని మేనేజ్ చేస్తూ.. ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తోంది: రాహుల్
-
Movies News
Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
-
World News
Jail Attack: నైజీరియా కారాగారంపై దాడి.. 600 మంది ఖైదీలు పరార్
-
Politics News
Congress: 110 ఏళ్ల చరిత్రలో.. యూపీ మండలిలో ప్రాతినిధ్యం కోల్పోయిన కాంగ్రెస్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్.. మోదీ కంగ్రాట్స్
- Venu Madhav: ఒక్క సీన్ అనుకుంటే మూడు సీన్లు అయ్యాయి
- Trending English words:ఈ 10 ట్రెండింగ్ ఇంగ్లిష్ పదాల గురించి తెలుసా?
- Driver Jamuna: ‘డ్రైవర్ జమున’గా ఐశ్వర్య రాజేశ్.. ఉత్కంఠ భరితంగా ట్రైలర్
- Amazon Prime Day sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్ తేదీలు ఫిక్స్.. ఈ కార్డులపై ప్రత్యేక ఆఫర్లు!
- Andhra News: అధికార పార్టీ అయినా... నెల్లూరు జిల్లాలో ఆ ఎమ్మెల్యే తీరే వేరు!
- Telangana News: నిమ్జ్ కోసం బలవంతపు భూసేకరణ.. రైతు బిడ్డ ఆవేదన
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Anand Mahindra: మీరు ఎన్నారైనా?.. నెటిజన్ ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా ఊహించని రిప్లై