Andhra News: సేవలందించలేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోండి

ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించలేకపోతే ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లిపోవాలని వైద్యాధికారులపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. పొందూరు సీహెచ్‌సీలో మంగళవారం

Updated : 02 Feb 2022 04:21 IST

వైద్యులపై స్పీకర్‌ తమ్మినేని ఆగ్రహం

పొందూరు, న్యూస్‌టుడే: ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించలేకపోతే ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లిపోవాలని వైద్యాధికారులపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. పొందూరు సీహెచ్‌సీలో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రిలో సరైన సేవలు అందడం లేదని, వైద్యులు అందుబాటులో ఉండటం లేదని, సౌకర్యాలు లేవని, స్థానిక నాయకులు సభాపతి దృష్టికి తీసుకొచ్చారు. సీహెచ్‌సీకి రూ.4.60 కోట్లు విడుదలయ్యాయని, అయినా సరైన సేవలందించకపోతే ఎలా అని స్పీకర్‌ వైద్యులను ప్రశ్నించారు. గైనిక్‌ డాక్టర్‌ అందుబాటులో ఉండడం లేదని, గర్భిణులను వేరే ఆసుపత్రికి పంపించేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై మెడికల్‌ ఆఫీసర్‌, గైనకాలజిస్టు డాక్టర్‌ శిరీషను ప్రశ్నించిన సభాపతి మరోసారి ఇలాంటి ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేది లేదన్నారు. తక్షణం ఆసుపత్రి అభివృద్ధి ఖాతా నుంచి నిధులు తీసి కావాల్సిన పరికరాలను కొనుగోలు చేయాలన్నారు. జనరల్‌ సర్జన్‌, ఎముకలు, జనరల్‌ మెడిసన్‌, గుండె సంబంధిత వైద్య నిపుణుల నియామకానికి చర్యలు చేపట్టాలని డీసీహెచ్‌వో సూర్యారావును ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో జాప్యంపై అధికారులు, సంబంధిత గుత్తేదారుపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని