Andhra News: చర్యలు తీసుకోవద్దనే వారి మాటలకు అర్థముందా: సజ్జల

‘మేం సమ్మె నోటీసునిచ్చాం కాబట్టి పనిచేయకపోయినా ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోరాదనే మాటలకు అర్థముందా?’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

Updated : 05 Feb 2022 04:18 IST

ఈనాడు, అమరావతి ‘మేం సమ్మె నోటీసునిచ్చాం కాబట్టి పనిచేయకపోయినా ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోరాదనే మాటలకు అర్థముందా?’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ‘సమ్మె నోటీసు ఇచ్చారని ప్రభుత్వం అన్ని కార్యకలాపాలను ఆపేయదు కదా? వైద్య ఆరోగ్యశాఖలో సహజ ప్రక్రియలోనే బదిలీలకు ప్రభుత్వం అనుమతిస్తే దాన్ని ఆపేయాలనడమేంటి?’ అని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ‘ఇలాంటివన్నీ మాట్లాడడం ద్వారా మీ అంతట (ఉద్యోగులు) మీరే పరిస్థితిని చెడగొట్టుకుంటున్నారు. రాజకీయ అజెండా ఏదో మిమ్మల్ని ముందుకు తోసుకువస్తుందేమో అన్నట్లు ఉంది. దాన్నుంచి బయటకు రావాలని సూచిస్తున్నాం. లేకపోతే తర్వాత ఏం జరిగినా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని స్పష్టం చేశారు. ‘సీపీఎస్‌, పొరుగు సేవల ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటివి చిటికేయగానే అయిపోయేవి కావు. ఇవి చేసేందుకు ప్రయత్నిస్తూనే చేయడం వల్ల మొత్తం సమాజం ఇబ్బంది పడడమో.. భవిష్యత్‌ తరాలు నింద మోసే పరిస్థితి రాకుండా సమతూకం చేసుకోవాలి కాబట్టే కొంత సమయం పడుతోంది’ అని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని