Tirupati: తిరుపతిలో మోహన్‌బాబు సినీ అకాడమీ

తిరుపతిలో ఈ ఏడాది మోహన్‌బాబు యూనివర్సిటీ ప్రారంభంకానుంది. ఇందులో మోహన్ బాబు సినీ అకాడమీ కూడా ఉంటుందని, ఇక్కడ సినిమా రంగంలోని అన్ని విభాగాల స్థానికులకు శిక్షణనిచ్చి ప్రోత్సహిస్తామని మా అధ్యక్షుడు, సినీ హీరో మంచు విష్ణు తెలిపారు.

Updated : 08 Feb 2022 03:38 IST

మా అధ్యక్షుడు మంచు విష్ణు వెల్లడి

తిరుపతి(విద్య), న్యూస్‌టుడే: తిరుపతిలో ఈ ఏడాది మోహన్‌బాబు యూనివర్సిటీ ప్రారంభంకానుంది. ఇందులో మోహన్ బాబు సినీ అకాడమీ కూడా ఉంటుందని, ఇక్కడ సినిమా రంగంలోని అన్ని విభాగాల స్థానికులకు శిక్షణనిచ్చి ప్రోత్సహిస్తామని మా అధ్యక్షుడు, సినీ హీరో మంచు విష్ణు తెలిపారు. తిరుపతిలో సోమవారం మన్యంరాజు సినిమా పోస్టర్‌ ఆవిష్కరణకు విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సినీ పరిశ్రమలో 20శాతం మంది చిత్తూరు జిల్లాకు చెందిన వారున్నారు. ఇది గర్వించదగ్గ విషయం. సినిమా టికెట్ల ధరలు తెలంగాణలో పెంచారు. ఆంధ్రప్రదేశ్‌లో తగ్గించారు. దీనిపై రెండు చోట్ల కోర్టుకు వెళ్లారు. ఇది పెద్ద అంశం. పరిశ్రమ మొత్తం ఏకాభిప్రాయంతో మాట్లాడాలి. తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ ఉంది. ఈ అంశంపై అందరం చర్చిస్తున్నాం. పరిశ్రమ ప్రతి ఒక్కరిది. ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్ణయానికి పరిశ్రమ కట్టుబడి ఉంటుంది. ఎన్ని ఉన్నా వ్యక్తిగతంగా మాట్లాడను. రెండు రాష్ట్రాల్లో టికెట్ల అంశంపై స్వలాభం కోసం ఒకరిద్దరు మాట్లాడటం మంచిది కాదు. రెండు ప్రభుత్వాలు సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాయి. మాకు కావాల్సిందేంటో వారితో చెప్పి చేసుకుంటాం. సమస్య ఉంటే పరిశ్రమకు చెందిన పెద్దలు కలిసి నిర్ణయం తీసుకుంటారు. మా అసోసియేషన్‌ వంద రోజుల ప్రగతిపై త్వరలో మీడియాతో మాట్లాడతా’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని