
Hijab: తుదితీర్పు వచ్చేవరకూ.. సంప్రదాయ వస్త్రాలు నిషేధం
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు మౌఖిక తీర్పు
ఈనాడు డిజిటల్, బెంగళూరు: హిజాబ్ వివాదంపై తుది తీర్పు వెల్లడించేవరకూ ఎవరూ సంప్రదాయ వస్త్రాలు ధరించి కళాశాలలకు రావద్దని కర్ణాటక హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మౌఖిక తీర్పు వెల్లడించింది. ఈ వివాదంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ ఖాజీ జైబున్నీసా మొహిద్దీన్లతో ఏర్పాటైన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు దేవదత్ కామత్, సంజయ్ హెగ్డేల వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు మధ్యంతర తీర్పుతో హిజాబ్ ధారణకు అవకాశం ఇవ్వాలని కోర్టును కోరారు. అడ్వొకేట్ జనరల్ ప్రభులింగ్ నవదగి మాత్రం ఆలస్యమైనా తుది తీర్పు ఇవ్వాలని కోరారు. వీలైనంత త్వరలోనే తుదితీర్పు వెల్లడిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అవస్థి హామీ ఇచ్చారు. రాజ్యాంగం, మతవిశ్వాసాలతో ముడిపడిన వివాదమైనందున దీర్ఘకాలిక విచారణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతవరకూ విద్యార్థులెవరూ హిజాబ్, ఇతరత్రా సంప్రదాయ వస్త్రాలతో కళాశాలలకు హాజరు కారాదని సూచించారు. ప్రభుత్వం తక్షణమే విద్యాసంస్థలు ప్రారంభించాలని మౌఖికంగా ఆదేశించారు. రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కును ఈ తీర్పు ద్వారా విద్యార్థులు కోల్పోతారని దేవదత్ కామత్ ఆరోపించారు. తీర్పు వెల్లడించే వరకూ సహకరించాలని జస్టిస్ అవస్థి కోరారు. విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. హిజాబ్‌పై కర్ణాటక సర్కారు ఆదేశాలను నిరసిస్తూ దిల్లీలోని కర్ణాటక భవన్ వద్ద ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు, పుణెలో ఎన్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు.
14న పదోతరగతి వరకు మాత్రమే ప్రారంభం: సీఎం
విద్యాసంస్థలను ప్రారంభించాలన్న కోర్టు ఆదేశం నేపథ్యంలో రాష్ట్రంలో దశలవారీగా తరగతులు ప్రారంభిస్తామని కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై ప్రకటించారు. సోమవారం నుంచి పదో తరగతి వరకు పాఠశాలలు ప్రారంభిస్తామన్నారు. తగిన సమీక్షల తర్వాత కళాశాలలను ప్రారంభిస్తామని ప్రకటించారు. విద్యాసంస్థలు మతప్రచారాలకు వేదిక కారాదన్నారు.
మతపరమైన ఘటనలపై మద్రాసు హైకోర్టు ఆవేదన
చెన్నై (ప్యారిస్), న్యూస్‌టుడే: భారతదేశం మతసామరస్య దేశమా? లేదా మతపరంగా విడిపోయిందా? అని మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. హిజాబ్ ధరించడం, ఆలయాల్లో సంప్రదాయ దుస్తులు ధరించడానికి పోరాటాలు చేయడం దిగ్భ్రాంతికరమని ఆవేదన వ్యక్తం చేసింది. మద్రాసు హైకోర్టులో ఓ వ్యక్తి గతంలో పిటిషన్ వేశారు. ‘1947లో తీసుకొచ్చిన తమిళనాడు ఆలయ ప్రవేశ చట్టం ప్రకారం హిందూయేతరులకు అనుమతి లేదు. 1970లో హిందూయేతరులు ఆలయాల్లోకి వచ్చేలా తీసుకొచ్చిన చట్టాన్ని హైకోర్టు రెండేళ్ల తర్వాత రద్దుచేసింది. అయినా ఇతర మతాలవారు, విదేశీయులను ఆలయాల్లోకి అనుమతిస్తున్నారు. అలా రావొద్దని సూచిక ఏర్పాటుచేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలి. సంప్రదాయ దుస్తులు ధరించేలా ఆదేశాలివ్వాలి’ అని కోరారు. ఈ కేసు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మునీశ్వర్నాథ్ భండారీ, జస్టిస్ భరతచక్రవర్తి ధర్మాసనం ముందు గురువారం విచారణకు వచ్చింది. మతసామరస్య దేశంలో ఇలాంటి సమస్యలు ఏర్పడకూడదని, పిటిషనరు డిమాండ్లు మతపరంగా దేశాన్ని విభజించేలా ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణను వారం రోజులకు వాయిదావేసింది.
సుప్రీంకోర్టులో మరో పిటిషన్
హిజాబ్ వివాదంపై గురువారం సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. నచ్చిన మతాన్ని అనుసరించడానికి రాజ్యాంగం హక్కు కల్పించిందని, ఆ హక్కులో చొరబడే ఘటనలు జరుగుతున్న దృష్ట్యా దీన్ని న్యాయస్థానం పరిగణనలో తీసుకోవాలని యువజన కాంగ్రెస్ నాయకుడు బి.వి.శ్రీనివాస్, మరో విద్యార్థి తమ పిటిషన్లలో పేర్కొన్నారు. వేర్వేరు హైకోర్టులు భిన్నమైన తీర్పులు వెలువరించే అవకాశం ఉన్నందువల్ల సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని కోరారు.
హిజాబ్‌పై విచారణ చేపట్టడాన్ని పరిశీలిస్తాం
- సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ ధర్మాసనం వెల్లడి
దిల్లీ: హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో కొనసాగుతున్న విచారణను సర్వోన్నత న్యాయస్థానానికి బదిలీ చేయాలన్న వినతిని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం ప్రకటించింది. తాము దీనిపై ఎలాంటి ఆదేశాలు కోరుకోవడం లేదనీ, అభ్యర్థనను లిస్టింగ్ చేస్తే చాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ చెప్పారు. ‘సరే.. మేం చూస్తాం’ అని ధర్మాసనం బదులిచ్చింది. ‘కర్ణాటకలో మొదలైన ఆందోళన దేశమంతటికీ విస్తరిస్తోంది. అందువల్ల కేసును సుప్రీంకోర్టులో తొమ్మండుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి బదిలీ చేయాలి’ అని సిబల్ కోరారు. రెండు నెలల్లోనే పరీక్షలు జరగనున్నాయనీ చెప్పారు. ‘ముందుగా హైకోర్టును ఒక నిర్ణయానికి రానివ్వండి. ఇప్పుడే మేం జోక్యం చేసుకోవడం తగదు. హైకోర్టు ఏదైనా ఉపశమనాన్ని కల్పిస్తుందేమో చూడడానికి కొంత సమయం ఇవ్వాలి. మేం ఇక్కడ ఆ అంశాన్ని లిస్ట్ చేస్తే హైకోర్టు ఇక విచారించదు’ అని జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ హిమాకోహ్లిల ధర్మాసనం పేర్కొంది. సిబల్ పట్టుబట్టడంతో.. దీన్ని పరిశీలిస్తామని తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Health: తరచుగా జబ్బుల బారిన పడుతున్నారా..? కాలేయం ఎలా ఉందో తెలుసుకోండి
-
Politics News
Maharashtra Crisis: ఏక్నాథ్ శిందేకి సపోర్టు చేయడానికి కారణం అదే..: రెబల్ ఎమ్మెల్యే
-
Politics News
Janasena: దోపిడీదారుల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు విముక్తి కల్పించాలి: నాగబాబు
-
General News
Health: పిల్లలకు అవసరమైతేనే శస్త్రచికిత్స
-
Business News
IRCTC ఖాతాకు ఆధార్ లింక్ చేయలేదా? లేదంటే ఈ సదుపాయం కోల్పోయినట్లే..!
-
General News
Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న చేతికొచ్చే వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వులను కరిగించేదెలా అని చింతించొద్దు!
- Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- Amit Shah: శివుడిలా మోదీ విషాన్ని దిగమింగుకున్నారు.. 19ఏళ్లు వేదన అనుభవించారు..!
- Super Tax: పాక్‌లో ‘సూపర్’ పన్ను!
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి