Bappi Lahari: బప్పీదా అల్విదా..

స్వరాలకు డిస్కో నడకలు నేర్పి.. దేశ యువతను ఉర్రూతలూగించిన బాలీవుడ్‌ సంగీత కెరటం బప్పీ లాహిరీ (69) ఈ లోకానికి అల్విదా (వీడ్కోలు) చెప్పారు. 1970-80లలో సినీ సంగీతంలో

Updated : 17 Feb 2022 03:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: స్వరాలకు డిస్కో నడకలు నేర్పి.. దేశ యువతను ఉర్రూతలూగించిన బాలీవుడ్‌ సంగీత కెరటం బప్పీ లాహిరీ (69) ఈ లోకానికి అల్విదా (వీడ్కోలు) చెప్పారు. 1970-80లలో సినీ సంగీతంలో ఆయన ఓ ఊపు తెచ్చారు. తను స్వరాలు అందించిన పాటలైనా.. ఆలపించిన గీతాలైనా శ్రోతల గుండెల్లో ఇప్పటికీ నిలిచిపోయాయి. ‘డిస్కోకింగ్‌’గా పేరు తెచ్చుకున్న బప్పీదా  ఇకలేరనే వార్త సంగీత అభిమానుల్ని విషాదంలో ముంచేసింది. అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ ఆప్నియా (నిద్రలో శ్వాస అందకపోవడం)తో బాధపడుతున్న ఆయన సోమవారమే ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. అనారోగ్యం తిరగబెట్టడంతో మంగళవారం మళ్లీ తీసుకొచ్చారు. ముంబయిలో జుహులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి వేళ కన్నుమూశారు. ‘చల్తే చల్తే’, ‘డిస్కో డ్యాన్సర్‌’, ‘షరాబీ’ లాంటి చిత్రాలతో సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేశారాయన. హిందీ, బెంగాలీతోపాటు తమిళ, కన్నడ, గుజరాతీ భాషా చిత్రాలకూ స్వరాలు అందించారు. బప్పీదా అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి. బప్పీ లాహిరీ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ఆయన ఆకస్మిక మరణం బాధాకరం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి’’ అని ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని