Andhra News: నా కుమారుడిపై కేసులు పెట్టొద్దమ్మా..!

కర్కశత్వం చూపిన కుమారుడిపై ఆ వృద్ధ తల్లి కన్న మమకారాన్ని చాటింది. నవమోసాలు మోసిన బిడ్డకు ఎక్కడ కష్టాలు వస్తాయోనని తల్లడిల్లింది. అమ్మ అమ్మేనంటూ నిరూపించింది.

Updated : 20 Feb 2022 09:14 IST

మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మతో వృద్ధురాలు

తాడేపల్లి, న్యూస్‌టుడే: కర్కశత్వం చూపిన కుమారుడిపై ఆ వృద్ధ తల్లి కన్న మమకారాన్ని చాటింది. నవమోసాలు మోసిన బిడ్డకు ఎక్కడ కష్టాలు వస్తాయోనని తల్లడిల్లింది. అమ్మ అమ్మేనంటూ నిరూపించింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని బ్రహ్మానందపురంలో తన తల్లి వృద్ధురాలైన నాగమణిని కుమారుడు శేషు విచక్షణారహితంగా కొట్టిన సంఘటన అందరినీ కలచివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ శనివారం ఆర్డీవో భాస్కరరెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాసులురెడ్డితో కలిసి నాగమణి ఇంటికి వెళ్లారు. వృద్ధురాలిని పరామర్శించారు. శేషుపై కేసు పెడదామా? అంటూ వాసిరెడ్డి పద్మ వృద్ధురాలిని ప్రశ్నించగా.. ‘వద్దు, వద్దమ్మా.. నన్ను బాగా చూసుకోమని చెప్పండి చాలు’ అంటూ అమ్మ ప్రేమను చాటుకుంది. ఈ సంఘటనను సుమోటోగా తీసుకొని ఆర్డీవో విచారణ జరుపుతారని ఛైర్‌పర్సన్‌ పద్మ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని