Updated : 21 Feb 2022 08:09 IST

Andhra News: అదనపు క్వాంటం పింఛను 70 ఏళ్లకు 7%

ఈనాడు, అమరావతి: పింఛనుదారులు, కుటుంబ పింఛనుదారులకు అదనపు క్వాంటం పింఛను సవరిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులిచ్చింది. ఇప్పటి వరకు అదనపు క్వాంటం పింఛను 70 ఏళ్లకు 10%, 75ఏళ్లకు 15% ఇస్తుండగా.. జనవరి 17న ఇచ్చిన ఉత్తర్వుల్లో వీటిని పూర్తిగా తొలగించింది. కేంద్రప్రభుత్వ విధానంలో 80 ఏళ్ల నుంచి 20% అదనపు క్వాంటం పింఛను ఇవ్వనున్నట్లు పేర్కొంది. దీనిపై పింఛనుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఆర్సీపై ఉద్యోగుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతల చర్చల్లో 70 ఏళ్లకు 7%, 75ఏళ్లకు 12% అదనపు క్వాంటం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఈ లెక్కన ఇప్పటి వరకు పొందే దాంట్లో 3% చొప్పున పింఛనుదారులు నష్టపోయారు. 70, 75 ఏళ్లకు అదనపు క్వాంటం పింఛను ఇచ్చిన మంత్రుల కమిటీ గత జనవరిలో ఇచ్చిన ఉత్తర్వుల్లోని శ్లాబుల్లో మార్పులు చేసింది. 85 ఏళ్ల నుంచి 100 ఏళ్ల వరకు 5-50% వరకు అదనపు క్వాంటం పింఛనును తగ్గించింది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని