Akhila Priya: కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియపై అభియోగపత్రాల దాఖలు

బోయిన్‌పల్లి ఠాణా పరిధిలో సంచలనం సృష్టించిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, ఆయన సోదరులు సునీల్‌రావు, నవీన్‌రావుల కిడ్నాప్‌ కేసులో పోలీసులు అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

Updated : 21 Feb 2022 08:48 IST

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: బోయిన్‌పల్లి ఠాణా పరిధిలో సంచలనం సృష్టించిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, ఆయన సోదరులు సునీల్‌రావు, నవీన్‌రావుల కిడ్నాప్‌ కేసులో పోలీసులు అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సహా మొత్తం 37 మందిపై 70 ప్రతులతో కూడిన అభియోగపత్రాలను న్యాయస్థానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే కేసు విచారణ చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

గతేడాది జనవరి 5న రాత్రి 7 గంటల సమయంలో ప్రవీణ్‌రావు అతని సోదరులు నివసించే మనోవికాస్‌నగర్‌లోని కృష్ణా రెసిడెన్సీలోకి ఐటీ అధికారుల వేషధారణతో దుండగులు చొరబడ్డారు. సినీ ఫక్కీలో ఆ ముగ్గురు సోదరులను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. పోలీసు యంత్రాంగం అప్రమత్తం కావడంతో.. తప్పించుకునే వీల్లేదని గ్రహించిన దుండగులు.. ఆ ముగ్గురిని 6న అప్పా జంక్షన్‌ వద్ద వదిలి వెళ్లారు. ఈ అపహరణకు భూమా అఖిలప్రియ.. ఆమె భర్త భార్గవ్‌రామ్‌, సోదరుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి, అనుచరుడు గుంటూరు శ్రీనుతో కలిసి పథకం రచించారని తెలుసుకున్న పోలీసులు 6నే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత మిగతా నిందితులను అరెస్టు చేశారు. అనంతరం ఒకరి తర్వాత ఒకరు బెయిల్‌పై విడుదలయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని