Inter Exams: ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఏప్రిల్‌ 22 నుంచి

ఇంటర్మీడియట్‌ పరీక్షలను వాయిదా వేస్తూ సవరణ షెడ్యూల్‌ను మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. ఏప్రిల్‌ 22 నుంచి మే 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం

Updated : 04 Mar 2022 04:56 IST

సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసిన మంత్రి సురేష్‌

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ పరీక్షలను వాయిదా వేస్తూ సవరణ షెడ్యూల్‌ను మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. ఏప్రిల్‌ 22 నుంచి మే 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతాయి. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 9 నుంచి 28 వరకు జరగాల్సి ఉండగా.. ఇదే సమయంలో జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు ఉండడంతో ఇంటర్మీడియట్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రాక్టికల్‌, నైతికత, మానవవిలువలు, పర్యావరణం పరీక్షలు పాత షెడ్యూల్‌ ప్రకారమే యథావిధిగా కొనసాగనున్నాయి. ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను జంబ్లింగ్‌ విధానంలో నిర్వహించాలని ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రాక్టికల్స్‌కు అవసరమయ్యే ప్రయోగశాలలు, సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని ప్రధాన అధ్యాపకులను ఆదేశించారు.

* నైతికత, మానవవిలువల పరీక్ష మార్చి 7న, పర్యావరణం 9న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతాయి.

* ప్రాక్టికల్‌ పరీక్షలు మార్చి 11 నుంచి 31 వరకు ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండు విడతల్లో నిర్వహిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని