Agriculture budget:వ్యవసాయ బడ్జెట్‌ రూ. 43,053 కోట్లు

2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.43,052.78 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను శాసనసభలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ... ‘ఉపాధి హామీతో వ్యవసాయాన్ని అనుసంధానం

Updated : 12 Mar 2022 06:29 IST

శాసనసభలో ప్రవేశపెట్టిన వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు
సేద్యంతో ఉపాధి హామీ అనుసంధానం
గొర్రెలు, మేకల కొనుగోలుకు నిధులు

ఈనాడు, అమరావతి: 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.43,052.78 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను శాసనసభలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ... ‘ఉపాధి హామీతో వ్యవసాయాన్ని అనుసంధానం చేయడానికి రూ.8,329 కోట్లు ప్రతిపాదించాం. రాష్ట్రంలోని అన్ని రైతు భరోసా కేంద్రాలకు దశలవారీగా 10వేల డ్రోన్లను రాయితీపై సరఫరా చేస్తాం. వాటి నిర్వహణకు 20వేల మంది గ్రామీణ యువతకు శిక్షణనిస్తాం. ఆర్గానిక్‌, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రూ.200 కోట్లు వెచ్చిస్తాం. 41,304 యూనిట్ల గొర్రెలు, మేకల కొనుగోలుకు రూ.309.78 కోట్లు ప్రతిపాదించాం. రూ.26.25 కోట్లతో 5,000 మినీ గోకులం షెడ్లను నిర్మిస్తాం. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఏర్పాటు చేయనున్న మత్స్య విశ్వవిద్యాలయలో 2022-23 నుంచి బోధన ప్రారంభిస్తాం. కొత్తగా 334 సహకార బ్యాంకు శాఖలు ప్రారంభిస్తాం’ అని ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని