Andhra News: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా మరో అడుగు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా మరో అడుగు పడింది. ఇప్పటివరకు న్యాయ, లావాదేవీ సలహాదారులను నియమించిన కేంద్ర ఆర్థికశాఖ తాజాగా సంస్థ ఆస్తి మదింపుదారు ఎంపికకు ‘రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌’ను ఆహ్వానిస్తూ శుక్రవారం ఉత్తర్వులు

Updated : 12 Mar 2022 07:40 IST

ఆస్తి విలువ మదింపుదారు ఎంపికకు బిడ్ల ఆహ్వానం

ఈనాడు, దిల్లీ: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా మరో అడుగు పడింది. ఇప్పటివరకు న్యాయ, లావాదేవీ సలహాదారులను నియమించిన కేంద్ర ఆర్థికశాఖ తాజాగా సంస్థ ఆస్తి మదింపుదారు ఎంపికకు ‘రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌’ను ఆహ్వానిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆసక్తి, అర్హత ఉన్న సంస్థలు ఏప్రిల్‌ 4వ తేదీ సాయంత్రం 3 గంటల్లోపు బిడ్లు దాఖలు చేయొచ్చని పేర్కొంది. ఏప్రిల్‌ 5న బిడ్లు తెరవనున్నట్లు తెలిపింది. ఇందులో ఎంపికైన సంస్థలు రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌, దాని అనుబంధ సంస్థల అన్ని రకాల ఆస్తుల విలువను లెక్కించాలని పేర్కొంది. ఆస్తుల భౌతిక స్థితిగతులు, వాటికి సమీపంలోని ప్రైవేటు ఆస్తుల క్రయవిక్రయాలు ఎంతకు జరుగుతున్నాయి అనే వివరాలనూ పొందుపరచాలని ఆర్థికశాఖ పేర్కొంది. భారత్‌ లేదా అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి నివేదిక తయారు చేయాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని