Andhra news: రాష్ట్రంలో 6.16 లక్షల మంది నిరుద్యోగులు

ఉపాధి కల్పన కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకున్న నిరుద్యోగులు రాష్ట్రంలో 6,16,689 మంది ఉన్నట్లు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరిలో పురుషులు 4,22,055 మంది ఉండగా.. మహిళలు 1,94,634 మంది ఉన్నారు.

Published : 17 Mar 2022 08:46 IST

శాసనసభలో వెల్లడించిన ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: ఉపాధి కల్పన కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకున్న నిరుద్యోగులు రాష్ట్రంలో 6,16,689 మంది ఉన్నట్లు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరిలో పురుషులు 4,22,055 మంది ఉండగా.. మహిళలు 1,94,634 మంది ఉన్నారు. శాసనసభలో తెదేపా ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, బాల వీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్‌, మంతెన రామరాజు అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. జనవరి వరకు ఉన్న వివరాలను వెల్లడించారు. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో నిరుద్యోగులు 98,504మంది ఉండగా.. కర్నూలులో 64,294మంది ఉన్నారు. సీఎం జగన్‌ సొంత జిల్లా కడప 58,837 మందితో మూడో స్థానంలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు