Updated : 18 Mar 2022 07:29 IST

Tirumala: 20న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

తిరుమల, న్యూస్‌టుడే: తిరు మల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించనున్నారు. అందులో భాగంగా ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన టికెట్లను ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో తితిదే విడుదల చేయనుంది. భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. 2020 మార్చిలో కొవిడ్‌ నేపథ్యంలో తితిదే శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించడం ఆపేసింది. రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు అనుమతించనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్‌ డిప్‌ విధానంలో కేటాయిస్తారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 10 నుంచి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు సేవలను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్లు పొందినవారి జాబితాను ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటల తర్వాత వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.

శ్రీవారి ఆలయంలో భక్తులకు తీర్థం, శఠారి

శ్రీవారి గర్భాలయంలో మూలమూర్తిని దర్శించుకున్న అనంతరం భక్తులకు స్వామివారి తీర్థం, శఠారి అందిస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో 2020 మార్చి నుంచి ఆలయంలో భక్తులకు తీర్థం, శఠారిని అందించడాన్ని తితిదే రద్దు చేసింది. అనంతరం శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించినా తీర్థం, శఠారిని ఇవ్వడం లేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆలయ ఆవరణంలో భక్తులకు తీర్థం, శఠారిని గత వారం నుంచి అందిస్తున్నారు. దీంతో వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Read latest Ap top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని