SSC Exams: పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 27 నుంచి

పదో తరగతి పరీక్షలను ఏప్రిల్‌ 27 నుంచి మే 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌

Updated : 19 Mar 2022 03:56 IST

ఇంటర్‌ పరీక్షలు మే 6 నుంచి

ఈనాడు, అమరావతి: పదో తరగతి పరీక్షలను ఏప్రిల్‌ 27 నుంచి మే 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ మారిన నేపథ్యంలో పదో తరగతి పరీక్షల తేదీలను ముందుకు తీసుకొచ్చారు. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం మే నెల రెండో తేదీ నుంచి 13 వరకు నిర్వహించాల్సి ఉంది. అనంతరం మే 9నుంచి నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఇచ్చి, ఆ తర్వాత వెనక్కి తీసుకున్నారు. జేఈఈ మెయిన్‌ పరీక్షల కారణంగా ఇంటర్‌ పరీక్షలు ఏప్రిల్‌ నుంచి మే నెలకు రావడంతో మే నెలలో ప్రారంభించాల్సిన పది పరీక్షలను ఏప్రిల్‌కు తీసుకొచ్చారు. పరీక్షలు ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఉంటాయి. ఈసారి ఏడు పేపర్ల విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. సామాన్యశాస్త్రంలో భౌతిక, రసాయన శాస్త్రం ఒక పేపర్‌గా.. జీవశాస్త్రం మరో పేపర్‌గా 50మార్కుల చొప్పున ఉంటాయి. మిగతా అన్ని సబ్జెక్టులు వంద మార్కులకు నిర్వహిస్తారు.

ఇంటర్‌ పరీక్షలు ఇలా..

ఇంటర్మీడియట్‌ పరీక్షలను మే 6 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నారు. సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు శుక్రవారం విడుదల చేశారు. జేఈఈ మెయిన్‌ పరీక్షల కారణంగా ఇప్పటికే రెండు పర్యాయాలు ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ మారిన విషయం విదితమే. తాజాగా కొత్త షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని