APPSC: 292 గ్రూప్స్‌ పోస్టుల భర్తీ

గ్రూప్స్‌ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. గతంలో విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ పోస్టులకంటే ఎక్కువగా భర్తీకి అనుమతించారు. గ్రూపు-1కు

Updated : 19 Mar 2022 03:55 IST

సీఎం పచ్చజెండా

ఈనాడు, అమరావతి: గ్రూప్స్‌ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. గతంలో విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ పోస్టులకంటే ఎక్కువగా భర్తీకి అనుమతించారు. గ్రూపు-1కు సంబంధించి 110, గ్రూపు-2లో 182 పోస్టులకు ఏపీపీఎస్సీ ప్రకటనలు జారీ చేయనుంది. గతేడాది జూన్‌లో విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌లో గ్రూపు-1, 2 కలిపి 36 పోస్టులు ప్రకటించగా.. ప్రస్తుతం 292 పోస్టులకు పెంచారు. గ్రూపు-1లో డిప్యూటీ కలెక్టర్ల పోస్టులు 10, ఆర్టీవో 7, కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ పోస్టులు 12 ఉన్నాయి. గ్రూపు-2లో డిప్యూటీ తహసీల్దార్లు 30, సబ్‌రిజిస్ట్రార్లు (గ్రేడ్‌-2) 16, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ సహకార శాఖ 15, పురపాలక కమిషనర్లు (గ్రేడ్‌-3) 5 పోస్టులు ఉన్నాయి.

110 గ్రూపు-1 పోస్టులు

డిప్యూటీ కలెక్టర్‌-10; రోడ్డు ట్రాన్స్‌పోర్టు అధికారి (ఆర్టీఓ)-7; కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారి (సీటీఓ) -12; జిల్లా రిజిస్ట్రార్‌ (స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌)-6; జిల్లా గిరిజన సంక్షేమాధికారి (డీటీడబ్ల్యూఓ)-1; జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి (డీఎస్‌డబ్ల్యూఓ)-1; జిల్లా బీసీ సంక్షేమ అధికారి (డీడబ్ల్యూసీడబ్ల్యూఓ)-3; డీఎస్పీ (సివిల్‌)-13; డీఎస్పీ (జైల్స్‌, మెన్స్‌)-2; జిల్లా అగ్నిమాపక అధికారి (డీఎఫ్‌ఓ)-2; అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ (ఏసీఎల్‌)-3; పురపాలక కమిషనర్‌-1; పురపాలక కమిషనర్‌ (గ్రేడ్‌-2)-8; డిప్యూటీ రిజిస్ట్రార్‌, కోఆపరేటివ్‌ విభాగం-2; ట్రెజరర్‌ గ్రేడ్‌2-5; ఏటీఓ/ఏఏఓ (ట్రెజరీస్‌ విభాగం)-8; ఏఏఓ (డీఎస్‌ఏ) (స్టేట్‌ ఆడిట్‌ విభాగం)-4; ఏఓ (డైరెక్టర్‌ పీహెచ్‌, ఎఫ్‌డబ్ల్యూ)-15; ఎంపీడీఓ-7.

182 గ్రూపు-2 పోస్టులు

డిప్యూటీ తహసీల్దార్‌-30; సబ్‌రిజిస్ట్రార్‌ గ్రేడ్‌2-16; అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, కోఆపరేటివ్‌-15; మున్సిపల్‌ కమిషనర్‌ (గ్రేడ్‌-3)-5; ఏఎల్‌ఓ (లేబర్‌)-10;ఏఎస్‌ఓ (లా)-2; ఏఎస్‌ఓ (లెజిస్లేచర్‌)-4; ఏఎస్‌ఓ (జీఏడీ)-50; జేఏ (సీసీఎస్‌)-5; సీనియర్‌ అకౌంటెంట్‌, ట్రెజరీ విభాగం-10; జూనియర్‌ అకౌంటెంట్‌, ట్రెజరీ విభాగం-20; సీనియర్‌ ఆడిటర్‌, స్టేట్‌ ఆడిట్‌ విభాగం-5; ఆడిటర్‌, పేఅండ్‌అలవెన్స్‌ విభాగం-10.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని