Ap news:జులై 4 నుంచి ఈఏపీసెట్‌

ఏపీ ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షను (ఈఏపీ సెట్‌) జులై 4 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బుధవారం ఆయన సచివాలయంలో ప్రకటించారు.

Updated : 24 Mar 2022 06:00 IST

ఏప్రిల్‌ 11న నోటిఫికేషన్‌ విడుదల
మంత్రి సురేష్‌ వెల్లడి

ఈనాడు, అమరావతి: ఏపీ ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షను (ఈఏపీ సెట్‌) జులై 4 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బుధవారం ఆయన సచివాలయంలో ప్రకటించారు. ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ ప్రవేశ పరీక్ష జులై 4 నుంచి 8 వరకు రోజుకు రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ స్ట్రీమ్‌ పరీక్ష జులై 11, 12 తేదీల్లో రోజుకు రెండు విడతల్లో ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 11న విడుదల చేయనున్నట్లు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ, ఫీజు, ఆఖరు తేదీ తదితర వివరాలు అందులో ఉంటాయని చెప్పారు. తెలంగాణలో 4 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రవేశ పరీక్ష ఫలితాలను ఆగస్టు 15 నాటికి వెల్లడించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈలోగా ఇంటర్‌ ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తిచేసి, సెప్టెంబరు రెండో వారం నుంచి తరగతులు మొదలయ్యేలా చూస్తామని తెలిపారు. ప్రవేశ పరీక్ష విధానం, ర్యాంకుల కేటాయింపుల్లో పాత విధానమే అమల్లో ఉంటుందని మంత్రి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు