ukraine Crisis: ఉక్రెయిన్‌పై ఏం చేద్దాం?
క్రెయిన్‌పై రష్యా యుద్ధం విషయంలో పరస్పరం భిన్న వైఖరుల్ని అనుసరిస్తున్న భారత్, అమెరికాలు సోమవారం ఒకే వేదికపైకి వచ్చి.. ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించాయి. పోరుతో నెలకొన్న సంక్షోభాన్ని ఎలా పరిష్కరిద్దాం అనే దానిపై మల్లగుల్లాలు పడ్డాయి.
మోదీ-బైడెన్ సుదీర్ఘ చర్చలు
మాది తటస్థ వైఖరే: భారత ప్రభుత్వం
రష్యా నుంచి చమురు దిగుమతులు సరికాదు: అమెరికా అధ్యక్షుడు
దిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం విషయంలో పరస్పరం భిన్న వైఖరుల్ని అనుసరిస్తున్న భారత్, అమెరికాలు సోమవారం ఒకే వేదికపైకి వచ్చి.. ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించాయి. పోరుతో నెలకొన్న సంక్షోభాన్ని ఎలా పరిష్కరిద్దాం అనే దానిపై మల్లగుల్లాలు పడ్డాయి. ఈ అంశంపై తమ తటస్థ వైఖరిని భారత్ పునరుద్ఘాటించింది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ల మధ్య వర్చువల్‌గా కీలక భేటీ జరిగింది. ఇందులో ఉక్రెయిన్ యుద్ధంపైనే ఇద్దరు నేతలు ప్రధానంగా చర్చించారు. పోరు వ్యవహారంలో భారత్ స్పందించిన తీరుపైన, రష్యా నుంచి రాయితీపై చమురు దిగుమతి చేసుకోవడంపైన అమెరికా అసంతృప్తిగా ఉందన్న వార్తల నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
శాంతి నెలకొంటుంది.. మోదీ: రష్యా, ఉక్రెయిన్ మధ్య ప్రస్తుతం జరుగుతున్న చర్చలు ఫలించి, శాంతి నెలకొంటుందన్న ఆశాభావాన్ని మోదీ ఈ భేటీలో వ్యక్తంచేశారు. ఉక్రెయిన్‌లోని బుచా నగరంలో అభంశుభం తెలియని పౌరులను చంపేయడం చాలా ఆందోళనకరమన్నారు. ఆ దుశ్చర్యలను ఖండిస్తున్నట్లు వెంటనే భారత్ స్పష్టంచేసిందని తెలిపారు. ఆ దారుణాలపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. ఉక్రెయిన్‌లో పౌరుల భద్రతకు, వారికి నిరాటంకంగా మానవతా సాయాన్ని అందించడానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తమ వంతుగా ఉక్రెయిన్‌కు, చుట్టుపక్కల దేశాలకు ఔషధాలు, ఇతర సహాయ సామగ్రిని అందజేసినట్లు వివరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో తాను ఫోన్లో మాట్లాడిన విషయాన్ని మోదీ ప్రస్తావించారు. ‘‘జెలెన్స్కీతో నేరుగా చర్చించాల్సిందిగా పుతిన్‌కు సూచించా’’ అని తెలిపారు. భారత్, అమెరికాలు ప్రపంచంలోనే అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్య దేశాలని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సహజసిద్ధ భాగస్వామ్యం ఉందన్నారు. ‘‘ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు భారత్-అమెరికా భాగస్వామ్యం పరిష్కార మార్గం చూపుతుందని గత ఏడాది సెప్టెంబర్‌లో నేను వాషింగ్టన్ వచ్చినప్పుడు మీరు అన్నారు. ఆ వాదనతో పూర్తిగా ఏకీభవిస్తున్నా’’ అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న సమయంలో తాము చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఆ దేశం నుంచి భారతీయ విద్యార్థులను వెనక్కి తీసుకురావడానికి చేపట్టిన కసరత్తును ప్రస్తావించారు.
భారత్‌కు ఏ చర్యలూ సూచించలేదు.. అమెరికా: బైడెన్ మాట్లాడుతూ.. భయానక దాడులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ ప్రజలకు భారత్ అందించిన మానవతా తోడ్పాటును స్వాగతిస్తున్నామన్నారు. గతవారం అక్కడ ఒక రైల్వే స్టేషన్‌పై ఫిరంగి గుళ్ల వర్షం కురిపించారని, అందులో చిన్నారులు, మహిళలు సహా పదుల సంఖ్యలో పౌరులు మరణించారని గుర్తుచేశారు. రష్యా యుద్ధంతో తలెత్తిన అస్థిర పరిస్థితులను చక్కదిద్దే అంశంపై భారత్, అమెరికాలు పరస్పరం సంప్రదించుకుంటాయని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య రక్షణ సహకారం బలపడుతోందని కూడా తెలిపారు. మరోవైపు రష్యా నుంచి చమురు దిగుమతులు పెంచుకోవడం భారత్‌కు ప్రయోజనకరం కాదని మోదీకి బైడెన్ సూచించినట్లు వైట్‌హౌస్ తెలిపింది. మరిన్ని మార్గాల నుంచి ఇంధన దిగుమతులు సాగించేలా చేయూతనందిస్తామని పేర్కొంది. ఇద్దరు నేతల మధ్య చర్చలు ఫలప్రదంగా సాగాయని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్‌ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్‌షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్‌పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్‌పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్‌లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్‌బాబు ఆత్మకూరు ఛైర్‌పర్సన్‌గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్‌పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్