- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
AP Cabinet: ముద్దాడారు.. మోకరిల్లారు
పాదాభివందనాలతో ప్రభుభక్తి చాటుకున్న మంత్రులు
ఈనాడు, అమరావతి: మంత్రి పదవి ఇచ్చినందుకు కొందరు.. మంత్రివర్గంలో మళ్లీ చోటిచ్చినందుకు మరికొందరు ప్రమాణస్వీకార వేదికపై ముఖ్యమంత్రి జగన్‌కు పాదాభివందనం చేసి ప్రభుభక్తిని చాటుకున్నారు. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా, వయసు తారతమ్యాలు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కాళ్లకు నమస్కరించారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవారు ముఖ్యమంత్రి, గవర్నర్ల వద్దకు వెళ్లి నమస్కరిస్తుంటారు. కరచాలనం చేస్తుంటారు. కానీ సోమవారం కొత్త మంత్రివర్గం ప్రమాణస్వీకారం సందర్భంగా కొందరు మంత్రులు ముఖ్యమంత్రికి పాదాభివందనం చేయగా, ముఖ్యమంత్రి వారిని ఆశీర్వదించారు. జగన్‌కంటే వయసులో చాలా పెద్దవారైన నారాయణస్వామి, బూడి ముత్యాలనాయుడు వంటివారూ ఆయన పాదాలకు నమస్కరించడం విశేషం. కొందరు కాళ్లకు నమస్కరించకపోయినా సగానికిపైగా వంగి దాదాపు ముఖ్యమంత్రి కాళ్లను తాకినంత పనిచేశారు. జగన్‌కు పాదాభివందనం చేసిన వారిలో బూడి ముత్యాలనాయుడు, నారాయణస్వామితోపాటు గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, ఉషశ్రీచరణ్, మేరుగ నాగార్జున, ఆర్.కె.రోజా, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, విడదల రజని ఉన్నారు. వారిలో కొందరు మోకాళ్లపై కూర్చుని జగన్ పాదాల్ని తాకి మరీ ఆశీర్వచనాలు తీసుకున్నారు. జగన్‌కు రోజా పాదాభివందనం చేసి ఆయన చేతిని ముద్దాడి కృతజ్ఞతలు తెలిపారు. కారుమూరి నాగేశ్వరరావు ఆయన కాళ్లకు నమస్కరించినంత పనిచేశారు. వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాం, కొట్టు సత్యనారాయణ, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పినిపే విశ్వరూప్, రాజన్నదొర బాగా వంగి జగన్‌కు నమస్కరించారు. ప్రమాణస్వీకారం చేసిన మంత్రులంతా మొదట ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి నమస్కరించగా.. ఒక్క బొత్స సత్యనారాయణ మాత్రం మొదట గవర్నర్ వద్దకు వెళ్లి నమస్కరించి తరువాత ముఖ్యమంత్రి వద్దకు వచ్చి కరచాలనం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావువంటి సీనియర్లు ముఖ్యమంత్రికి నమస్కరించి కరచాలనం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Namitha: కవలలకు జన్మనిచ్చిన సినీనటి నమిత
-
India News
Free mobile: స్మార్ట్‌ఫోన్ ఫ్రీ.. మూడేళ్లు ఇంటర్నెట్ ఫ్రీ.. ఆ రాష్ట్ర సర్కార్ కొత్త స్కీమ్!
-
Crime News
CBI: దిల్లీ లిక్కర్ స్కామ్.. హైదరాబాద్‌లో సీబీఐ సోదాలు
-
World News
Cancer Deaths: ధూమపానం వల్లే క్యాన్సర్ మరణాలు అధికం : ది లాన్సెట్
-
India News
monkeypox: మంకీపాక్స్ నిర్ధారణ స్వదేశీ కిట్ విడుదల.. ఏపీలోనే తయారీ
-
India News
Nithyananda: నిత్యానందకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- మూడో కంటికి తెలియకుండా రెండు ఉద్యోగాలు.. ఇప్పుడు రిటైర్మెంట్
- China: వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్..! ఎందుకు..?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- రూ.20కోట్ల నగల దోపిడీలో ఊహించని ట్విస్ట్.. ఇన్స్పెక్టర్ ఇంట్లో 3.7కిలోల బంగారం
- Vijay Deverakonda: తెలుగు ప్రెస్‌మీట్ వివాదం.. స్పందించిన విజయ్ దేవరకొండ
- Tamil rockerz Review: రివ్యూ: తమిళ్ రాకర్స్
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Sehwag - Akhtar: నిన్ను ఓపెనర్‌గా పంపించాలనే ఐడియా ఎవరిది..?