Sri rama navami: నేడు ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం

వైఎస్‌ఆర్‌ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి సీతారాముల కల్యాణ మహోత్సవం జరగనుంది. ముఖ్యమంత్రి  జగన్‌, మంత్రులు, ప్రముఖులు హాజరు  ...

Published : 15 Apr 2022 07:46 IST

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: వైఎస్‌ఆర్‌ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి సీతారాముల కల్యాణ మహోత్సవం జరగనుంది. ముఖ్యమంత్రి  జగన్‌, మంత్రులు, ప్రముఖులు హాజరు కానున్నారు.  

కల్యాణ మహోత్సవ ఏర్పాట్లను తితిదే ఈవో జవహర్‌రెడ్డి గురువారం పరిశీలించారు. వసతుల కల్పన, అన్నప్రసాదం, ముత్యాల తలంబ్రాల పంపిణీపై కలెక్టరు విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌, జేఈవో వీరబ్రహ్మం, జేసీ సాయికాంత్‌వర్మ, ఇతర సీనియర్‌ అధికారులతో చర్చించారు.

వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం రఘురాముడు మోహినీ అలంకారంలో దర్శనమిచ్చారు. ఒంటిమిట్ట వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు.

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం ఒంటిమిట్ట వెళ్లి కల్యాణోత్సవానికి హాజరై పట్టువస్త్రాలు సమర్పించి కల్యాణోత్సవాన్ని తిలకిస్తారు. అనంతరం కడప చేరుకొంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని