వివేకా కేసులో బెయిల్‌ పిటిషన్ల విచారణ.. వైదొలగిన జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు వై.సునీల్‌ యాదవ్‌ (ఏ2), గజ్జల ఉమాశంకర్‌రెడ్డి (ఏ3) దాఖలు చేసిన బెయిలు పిటిషన్లపై విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ వైదొలగారు. ఈ పిటిషన్లు తగిన బెంచ్‌ ముందుకు

Updated : 26 Apr 2022 08:54 IST

ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు వై.సునీల్‌ యాదవ్‌ (ఏ2), గజ్జల ఉమాశంకర్‌రెడ్డి (ఏ3) దాఖలు చేసిన బెయిలు పిటిషన్లపై విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ వైదొలగారు. ఈ పిటిషన్లు తగిన బెంచ్‌ ముందుకు విచారణకొచ్చే వ్యవహారంపై నిర్ణయం తీసుకునేందుకు ఫైల్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర వద్ద ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. నిందితులు సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిలు పిటిషన్లు సోమవారం జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ వద్దకు విచారణకు వచ్చాయి. సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు స్పందిస్తూ.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బెయిలు పిటిషన్‌ను వేరే బెంచ్‌ ముందు విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఇదే కోర్టు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. దాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. తాజాగా దాఖలైన రెండు బెయిలు పిటిషన్ల విచారణ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.
ః మరోవైపు కడపలోని రిమ్స్‌ ఠాణా పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌ దాఖలు చేసిన వ్యాజ్యం వేసవి సెలవుల తర్వాతకు వాయిదా పడింది. సోమవారం ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ విచారణ జరిపారు. ప్రతివాదుల తరఫు న్యాయవాదులు కౌంటర్‌ వేసేందుకు సమయం కోరడంతో వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని