Special Trains: పోటీ పరీక్షలకు 65 ప్రత్యేక రైళ్లు.. తెలుగు రాష్ట్రాలకూ వెసులుబాటు

సాంకేతికేతర విభాగాల్లోని పోస్టుల కోసం రైల్వే నియామక సంస్థ (ఆర్‌ఆర్‌బీ) ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌలభ్యం కోసం 65 ప్రత్యేక రైళ్లను నడపాలని    రైల్వేశాఖ

Published : 06 May 2022 09:19 IST

దిల్లీ: సాంకేతికేతర విభాగాల్లోని పోస్టుల కోసం రైల్వే నియామక సంస్థ (ఆర్‌ఆర్‌బీ) ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌలభ్యం కోసం 65 ప్రత్యేక రైళ్లను నడపాలని   రైల్వేశాఖ నిర్ణయించింది. ఎక్కువ రైళ్లు మే 8న ఉంటాయి. ప్రత్యేక రైళ్ల రుసుమును విద్యార్థులు చెల్లించాలని, రాయితీలు ఉండవని అధికార వర్గాలు తెలిపాయి. కాకినాడ-కర్నూలు, కడప-రాజమహేంద్రవరం, కాకినాడ-మైసూరు, కర్నూలు-మైసూరు, నర్సాపురం-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-ఎర్నాకుళం, విజయవాడ-నాగర్‌సోల్‌, షాలీమార్‌-విజయవాడ, హటియా-విజయవాడ, నర్సాపురం-త్రివేండ్రం వంటి ప్రత్యేక రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని