
Chandrababu: చంద్రబాబుపై సీఐడీ కేసు
మాజీమంత్రి నారాయణ, మరి కొందరిపై కూడా..
రాజధాని ప్రణాళిక, రింగ్‌రోడ్డు, రహదారుల అలైన్‌మెంట్‌లలో అక్రమాలు జరిగాయని ఆరోపణ
గత నెల 27న వైకాపా ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు
ఈ నెల 6న అందిన విచారణ నివేదిక.. 9న కేసు
ఈనాడు, అమరావతి: తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీమంత్రి పొంగూరు నారాయణ, మరికొందరిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరానికి సంబంధించిన బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, దాన్ని అనుసంధానించే ఆర్టీరియల్ రహదారుల అలైన్‌మెంట్ వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు, అవినీతి చోటుచేసుకున్నాయంటూ మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సోమవారం సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ ఎఫ్‌ఐఆర్ ప్రతులు మంగళవారం వెలుగుచూశాయి. ఏప్రిల్ 27న ఫిర్యాదు ఇవ్వగా.. దానిపై ప్రాథమిక విచారణ నివేదిక ఈ నెల 6న అందిందని, దాని ఆధారంగా కేసు నమోదు చేశామని సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఐపీసీ 120బీ, 420, 34, 35, 36, 37, 166, 167, 217లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2) రెడ్‌విత్ 13 (1) (ఎ) కింద నిందితులపై అభియోగాలు మోపింది.
ఫిర్యాదు సారాంశం ఇదీ
‘‘2014-19 మధ్య ప్రభుత్వంలో అత్యంత ఉన్నతస్థాయిలో ఉన్న అధికారులు రాజధాని బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ వ్యవహారంలో అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారు. తద్వారా ఆ ప్రభుత్వంలో నిర్ణయాధికారం కలిగిన వారితో సంబంధం ఉన్న కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలకు అనుచిత లబ్ధి కలిగించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారు. తద్వారా మోసానికి పాల్పడ్డారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారని సీఐడీ ఎఫ్‌ఐఆర్‌లో వివరించింది.
ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా పేర్కొంది వీరినే..
1. చంద్రబాబునాయుడు (అప్పటి ముఖ్యమంత్రి, సీఆర్‌డీఏ ఛైర్మన్)
2. పొంగూరు నారాయణ (అప్పటి మంత్రి, సీఆర్‌డీఏ వైస్ ఛైర్మన్)
3. లింగమనేని రమేష్
4. లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్
5. కేపీవీ అంజనీకుమార్ అలియాస్ బాబీ- రామకృష్ణ హౌసింగ్ డైరెక్టర్
6. హెరిటేజ్ ఫుడ్స్
7. ఎల్‌ఈపీఎల్ ప్రాజెక్ట్స్
8. ఎల్‌ఈపీఎల్ ఇన్ఫోసిటీ
9. ఎల్‌ఈపీఎల్ స్మార్ట్ సిటీ
10. లింగమనేని అగ్రికల్చర్ డెవలపర్స్
11. లింగమనేని ఆగ్రో డెవలపర్స్
12. జయని ఎస్టేట్స్; 13. రామకృష్ణ హౌసింగ్
14. ప్రభుత్వాధికారులు, ప్రైవేటు వ్యక్తులు, ఇతరులు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Rocketry: మాధవన్ ‘రాకెట్రీ’ని మెచ్చిన సీబీఐ అధికారులు
-
General News
HMDA: పోచారంలో ముగిసిన రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కేటాయింపు
-
India News
Maharashtra Crisis: వాళ్లు రెబల్స్ కాదు.. ద్రోహులు! ఎప్పటికీ గెలవలేరు: ఆదిత్య ఠాక్రే
-
World News
Monkeypox: 50 దేశాలకు పాకిన మంకీపాక్స్.. ప్రస్తుతానికి అత్యయిక స్థితి కాదు : WHO
-
World News
Ukraine: షాపింగ్‌మాల్‌పై రష్యా క్షిపణి దాడి.. పది మందికిపైగా మృతి
-
India News
Maharashtra crisis: సుప్రీం తీర్పు.. బాలా సాహెబ్ సాధించిన హిందుత్వ విజయం: ఏక్నాథ్ శిందే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Modi-Biden: హలో మోదీ జీ.. దగ్గరకు వచ్చి మరీ పలకరించిన జో బైడెన్
- Monkeypox: 50 దేశాలకు పాకిన మంకీపాక్స్.. ప్రస్తుతానికి అత్యయిక స్థితి కాదు : WHO
- Putin: ఆ సమయంలో.. పుతిన్ కాన్వాయ్ ఎందుకు వెళ్లింది..?
- Vikram: కమల్‌హాసన్ ‘విక్రమ్’ 25 రోజుల్లో మరో రికార్డు!
- Slice App: స్లైస్ యాప్‌తో ముప్పు ఉందన్న గూగుల్.. వివరణ ఇచ్చిన ఫిన్‌టెక్ సంస్థ!
- Loan apps: వద్దన్నా లోన్లు.. ‘నగ్న ఫొటో’లతో వేధింపులు!
- Anand Mahindra: క్వాలిఫికేషన్ అడిగిన నెటిజన్.. వైరల్‌గా మారిన ఆనంద్ మహీంద్రా సమాధానం!
- Thank you: నన్ను బౌన్సర్ అనుకొని తోసేశారు: తమన్
- COVID cases: తెలంగాణలో కొనసాగుతున్న కొవిడ్ ఉద్ధృతి.. హైదరాబాద్‌లో ఎన్నంటే?
- Viral Video: బోరిస్ జాన్సన్‌ను వెంబడించిన పోలీసులు.. అసలేమయ్యింది..?